ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణా కాంగ్రెస్ కూడా వేగం పెంచింది.ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేసి ప్రచారం కూడా మొదలు పెట్టేసారు.
కానీ టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు ఇంకా కూటమి హడావుడిలో సీట్లు సర్దుబాటు చేసుకునే పనిలోనే ఉంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడింది.
ఇలా అయితే వెనకబడిపోతామనే దృష్టితో.తమ పార్టీ అభ్యర్థుల మొదటి లిస్ట్ ప్రకటించేందుకు సిద్ధం అయ్యింది.

మొదటి లిస్టుపై చర్చించేందుకు కోర్ కమిటీ భేటీ కాబోతుంది.కోర్ కమిటీలో కూటమిలో భాగస్వామ్య పక్షాలకు అభ్యంతరం లేని స్థానాలను మొదటి లిస్టులో చేర్చాలని భావిస్తోంది.మహా కూటమి చర్చల్లో మొదటి లిస్టులో ప్రకటించే స్థానాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించినట్లు తెలుస్తోంది.రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉండడంతో అభ్యర్థుల మొదటి లిస్టు రిలీజ్‌కు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోయే మొదటి లిస్ట్ ఈ విధంగా ఉండబోతున్నట్టు సమాచారం.
కూటమిలో క్లారిటీ వచ్చాక మొత్తం అభ్యర్థుల లిస్ట్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. 1.మర్రి శశిధర్‌రెడ్డి -సనత్‌నగర్.2.జీవన్‌రెడ్డి -జగిత్యాల.3.శ్రీధర్‌బాబు -మంథని.ఎ.లక్ష్మణ్‌కుమార్ -ధర్మపురి.5.ఆరెపల్లి మోహన్ -మానకొండూరు.6.భట్టి విక్రమార్క -మథిర.7.రేవంత్‌రెడ్డి -కొడంగల్.8.చిన్నారెడ్డి -వనపర్తి.9.డి.కె అరుణ-గద్వాల.10.సంపత్‌కుమార్- అలంపూర్.11.వంశీచందర్‌రెడ్డి -కల్వకుర్తి.12.రామ్మోహన్‌రెడ్డి -పరిగి.13.సబితఇంద్రారెడ్డి -మహేశ్వరం.14.ప్రతాప్‌రెడ్డి -షాద్‌నగర్.15.మహేశ్వర్‌రెడ్డి -నిర్మల్.16.దామోదర్ రాజనర్సింహ -ఆంథోల్.17.సునితా లక్ష్మారెడ్డి -నర్సాపూర్.18.గీతారెడ్డి -జహీరాబాద్.19.జగ్గారెడ్డి -సంగారెడ్డి.20.ప్రతాప్‌రెడ్డి -గజ్వేల్.21.కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -నల్గొండ.22.దామోదర్‌రెడ్డి -సూర్యాపేట్.23.జానారెడ్డి-నాగార్జునసాగర్.24.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -హుజూర్‌నగర్.25.పద్మావతి -కోదాడ.26.భిక్షమయ్యగౌడ్ -ఆలేర్.27.సుదర్శన్‌రెడ్డి -బోధన్.28.షబ్బీర్‌అలీ -కామారెడ్డి.29.అనిల్ -బాల్కొండ.30.పొన్నాల లక్ష్మయ్య -జనగాం.31.గడ్డం ప్రసాద్- వికారాబాద్.32.దొంతి మాధవరెడ్డి -నర్సంపేట.33.గండ్ర వెంకటరమణారెడ్డి -భూపాలపల్లి.34.సీతక్క -ములుగు.35.మల్‌రెడ్డి రంగారెడ్డి- ఇబ్రహీంపట్నం.36.ఎల్.బి.నగర్- సుధీర్‌రెడ్డి.37.ఆది శ్రీనివాస్- వేములవాడ.38.నాగం జనార్దన్‌రెడ్డి- నాగర్‌కర్నూల్.39.విష్ణువర్ధన్‌రెడ్డి- జూబ్లీహిల్స్.







