బిగ్‌బాస్ 4 ఫినాలే గెస్ట్‌గా ఎన్టీఆర్.. వారు ఒప్పుకుంటారా?

టాలీవుడ్ బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ రియాలిటీ షోకు ప్రముఖ స్టార్ హీరోలు హోస్టింగ్ చేయడం దగ్గర్నుండి ఈ షోలో కంటెస్టెంట్స్‌గా పాల్గొనే వారు కూడా తమ కెరీర్‌ను సెట్ చేసుకునేందుకు ఎన్నో కలలు కంటుంటారు.

 Ntr As Guest For Biggboss 4 Finale Doubtful, Ntr, Biggboss 4, Nagarjuna, Abhijee-TeluguStop.com

కాగా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.ముందు మూడు సీజన్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సీజన్ 4కు కూడా అంతే స్థాయిలో రెస్పా్న్స్ లభిస్తుంది.

కాగా బిగ్‌బాస్ సీజన్ 4 మరో 4 రోజుల్లో ఫైనల్ ఎపిసోడ్‌కు చేరుకుంటుండటంతో ఈసారి విజేతగా ఎవరు నిలుస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈసారి బిగ్‌బాస్ ఫినాలే షోకు ఎవరు గెస్ట్‌గా వస్తున్నారా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో నెలకొంది.

అయితే ఈసారి ఫినాలేలో ముఖ్య అతిథిగా ఎవరు వస్తారా అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.కాగా బిగ్‌బాస్ 3 ఫినాలే కోసం నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు.

అయితే ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ముఖ్య అతిథిగా తీసుకొస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.కానీ ఇటీవల తారక్ వేరొక ఛానల్‌లో ఓ షో చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు ఆయన బిగ్‌బాస్ కోసం ముఖ్య అతిథిగా వస్తాడా లేడా అనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

అయితే బిగ్‌బాస్ సీజన్ 1ను హోస్ట్ చేసిన తారక్, తనకు ఈ షోపై ఉన్న ప్రాముఖ్యతతో ఈసారి గెస్ట్‌గా వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.

కానీ తారక్ బిగ్‌బాస్ గెస్ట్‌గా రావాలంటే ఆయన హోస్ట్ చేయబోయే షో నిర్వాహకులతో పాటు సదరు ఛానల్ వారు కూడా అంగీకరించాల్సి ఉంటుంది.మరి బిగ్‌బాస్ 4 ఫినాలేలో గెస్ట్ ఎవరనే ప్రశ్నకు ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ మాత్రమే సమాధానంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube