అధిక ఫీజుల వసుళ్లపై ఎంఈఓకు ఎన్.ఎస్.యు.ఐ ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు పట్టణం( Alair )లోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మండల విద్యాధికారి కార్యాలయం సిబ్బందికి ఎన్.

ఎస్.

యు.ఐ అధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.ప్రైవేట్ స్కూల్లకు చెందిన కొందరు తమ అనునాయులకు చెందిన నిర్దేశిత ప్రాంతంలో పాఠ్యపుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నారని, తప్పనిసరిగా తమ వద్ద పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్,యూనిఫామ్స్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, నూతనంగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫౌండేషన్ ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిబ్బందికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు కుండె శివ,మండల అధ్యక్షుడు ఆలకుంట్ల దుర్గాప్రసాద్,నాయకులు వినయ్,దిలీప్,చింటూ, సన్నీ,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సమంతను వదలని ఆ ఇద్దరు డైరక్టర్లు...మరో ఛాన్స్ కొట్టేసిన నటి!
Advertisement

Latest Video Uploads News