స్మార్ట్ వాచ్ ప్రియులకు శుభవార్త... 'నాయిస్' నుంచి అదిరిపోయే వాచ్ వచ్చేసింది!

ప్రస్తుతం దేశ యువత ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్‌కి అలవాటు పడ్డారు.ఈ క్రమంలో ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లను( Smart Watch ) ఎక్కువగా కొంటున్నారు.

దాంతో మార్కెట్లో అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు రకరకాల మోడల్స్‌లో స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి.దీంతో యువత స్మార్ట్ వాచ్‌లవైపు ఎక్కువగా మొగ్గు చూపిన పరిస్థితి.

నేటి యువతలో దాదాపు 70 శాతం మంది స్మార్ట్ వాచ్ కలిగి ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు.ఇకపోతే నాయిస్ కంపెనీ( Noise ) ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వాచ్‌లతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.

అందుకే మనోళ్లు ఆ బ్రాండ్ వాచెస్ కొనడానికి పోటీపడుతూ వుంటారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా-3( Noise ColorFit Ultra 3 ) మోడల్‌ను రిలీజ్ చేసింది.

Advertisement

మంచి మెటాలిక్ డిజైన్‌తో వచ్చే ఈ వాచ్ చూడడానికి ప్రీమియం లుక్‌లో ఉంది.కేవలం రూ.4499కే ఈ వాచ్ మార్కెట్లో అందుబాటులో వుంది.ఇక్కడ వాచ్ స్ట్రిప్స్‌ను మనం ఎంచుకునే అవకాశం కంపెనీ కల్పించడం అనేది మెచ్చుకోదగ్గ విషయం.

గమనిక: స్ట్రిప్స్( Strips ) కారణంగా వాచ్ ధర రూ.5499గా వరకూ పెరుగుతుంది అని గుర్తు పెట్టుకోవాలి.

ఈ వాచ్‌ ఫీచర్లు ఏంటో ఓ లుక్కేద్దాం.

మెటాలిక్ బిల్డ్‌,1.96 ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 410×502 పిక్సెల్‌ రిజుల్యూషన్, 550నిట్స్ బ్రైట్ నెస్, 150 ప్లస్ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు, బ్లూటూత్ 5.3తో కాలింగ్‌ ఫెసిలిటీ,అంతర్నిర్మిత మైక్, స్పీకర్,300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్,

100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, హార్ట్ బీట్ రేటు, ఎస్‌పీఓ2, యాక్సిలెరోమీటర్,నాయిస్ హెల్త్ సూట్,ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్,స్మార్ట్ నోటిఫికేషన్‌లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఇన్‌బిల్ట్ గేమ్‌లు, వాతావరణ వివరాలు, రిమోట్ కెమెరా కంట్రోల్, టైమర్, రిమైండర్ వంటి సదుపాయాలు, నాయిస్ ఫిట్ యాప్ సపోర్ట్, 1 సంవత్సరం వారెంటీ.

ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)
Advertisement

తాజా వార్తలు