నీటి కొరత లేని రాష్ట్రంగా తెలంగాణ

అడుగంటిన భూగర్భ జలాలతో నిత్యం నీటి కొరతను ఎదుర్కొన్న తెలంగాణ ప్రజలకు గత ఏడేళ్లలో నీటి కరువు తీరింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2015 మే మాసంలో భూగర్భ మట్టానికి 13.

27 మీటర్ల సగటు లోతులో నీరు అందుబాటులో ఉంది.2022 మే మాసం నాటికి భూగర్భ మట్టానికి 9.01 మీటర్ల సగటు లోతులో మాత్రమే నీరు లభిస్తోంది.అనగా గత ఏడేళ్ల వ్యవధిలో 4.26 మీటర్ల మేరకు భూగర్భ జలమట్టం పెరిగింది.రాష్ట్రంలో భూగర్భ జల శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

పరిశోధన, నీటి మట్టాలను పర్యవేక్షించడం, నాణ్యత, డ్రిల్లింగ్‌ అనే నాలుగు పారామీటర్ల ఆధారంగా భూగర్భ జలశాఖ పని చేస్తోంది.ఈ సంవత్సరం తాజాగా జరిగిన విశ్లేషణలో తేలిందేమంటే 2017లో 65 శాతం ఉన్న భూగర్భ జలం వినయోగం ప్రస్తుతం 42 శాతానికి తగ్గింది.

అంతేకాకుండా రాష్ట్రంలో నున్న మండలాలలో 83 శాతం మండలాలు సేఫ్‌ కేటగిరీలో చేరి మరింత అభివృద్ధికానున్నాయి.రాష్ట్రంలోని దళితులు, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధి క్రింద వివిధ పథకాల అమలుకొరకు భూపంపిణీ, గిరివికాసం, తాగునీటి వనరుల అన్వేషణ వాల్టా సర్వేలు, జలశక్తి అభియాన్‌, ఇసుక తవ్వకాలు, కృత్రిమ నీటి సంరక్షణ నిర్మాణాలు, పర్యావరణ అనుమతులకు అవసరమయ్యే సర్వేలు లిఫ్‌‌ట ఇరిగేషన్‌ స్కీంలలో నీటి లభ్యతపై పరిశోధించడం జరుగుతోంది.

శాఖలోని అధికారులతో పాటు హైడ్రోజియాలజిస్టులు, హైడ్రాలజిస్టులు, హైడ్రోకెమిస్టులు సేవలు అందిస్తున్నారు.

Advertisement

2021-22 సంవత్సరంలో 12,500 పరిశోధనలు నిర్వహించి 10,946 చోట్ల నీటి లభ్యతపై సానుకూల సిఫారసులు చేసింది.అలాగే దళితులు, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధి పథకాలలో భాగంగా 2,885 చోట్ల బోరు బావులు, ట్యూబ్‌ బావులు వేసేందుకు సిఫారసు చేసింది.ఫలితంగా 4,500 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగి 6,616 హెక్టార్లకు సాగునీరు అందుతోంది.

రాష్ట్రంలో 3,400 ఫిజో మీటర్లు, కమాండ్‌ ఏరియా బావులు, ఇతర బావులు, మ్యాపులు, చార్టులు ద్వారా ప్రతి నెలా ప్రభుత్వానికి నివేదిస్తోంది.జల మట్టాల పర్యవేక్షణ సాంద్రత విషయంలో జాతీయ స్థాయిలో నెట్‌ వర్క్ వెల్‌ ఉంది.

తాగునీరు, సాగునీరు విషయంలో భూగర్భ జలం నాణ్యతను నిర్ధారించేందుకు సంవత్సరానికి రెండుసార్లు విశ్లేషిస్తారు.

వర్షాకాలం ప్రారంభానికి ముందు మే మాసంలో వర్షాకాలం అనంతరం నవంబర్‌ మాసంలో విశ్లేషణ జరుగుతుంది.ఆ విధంగా 2021-22 సంవత్సరంలో9,942 శాంపిల్‌‌స సేకరించి విశ్లేషించి నాణ్యతను నిర్ధారించారు.శాఖాపరంగా ఉన్న ల్యాబ్‌ ూ.అ.ఆ.ఔ.సర్టిఫికెట్‌ను కలిగిఉంది.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశా నిర్దేశం మేరకు భూగర్భ జల శాఖ ద్వారా కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు, ఈ ప్రక్రియలో అవార్డులు, ప్రశంసలు, పొందేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది.అవి పరిశీలించి ప్రజలకు భూగర్భ జల శాఖ మరింత చేరువ కావాలని అశించవచ్చు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు