ఎంతమంది పీకేలను పెట్టుకున్నా ఏం చేయలేరు..: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.

చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటిషియన్ అని తెలిపారు.

చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా జగన్ ను ఏం చేయలేరని కొడాలి నాని పేర్కొన్నారు.ప్రశాంత్ కిషోర్ కు ఐప్యాక్ కు సంబంధం లేదన్నారు.

ప్రశాంత్ కిషోర్ ను తాము పూర్తిగా వాడేశామన్న కొడాలి నాని ఆయన బుర్రలో గుజ్జు అంతా అయిపోయిందని చెప్పారు.ఇండియా కూటమిలో చేరమని మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశారని తెలిపారు.

పార్ట్ నర్ పీకే బీజేపీతో చర్చలు జరుపుతుంటే మరో పీకే ఇండియా కూటమితో చర్చలు జరుపుతున్నారని విమర్శించారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు