బెయిల్ లేదు జైలే : చింతమనేని చింతకు కారణం ఏంటి ?

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తనకు అడ్డే లేదు అన్నట్టుగా అప్పటి దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ వ్యవహరించారు.

ఇసుక వివాదం ఎంఆర్ఓ వనజాక్షి పై దాడి తదితర అంశాలతో రాష్ట్రవ్యాప్తంగా చింతమనేని వివాదాస్పద ఎమ్మెల్యే గా గుర్తింపు తెచ్చుకున్నారు.

కేవలం ప్రత్యర్థి పార్టీల నాయకులే కాకుండా జిల్లాకు చెందిన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతోనూ చింతమనేని వివాదం పెట్టుకుంటూ కాక రేపుతూ ఉండేవారు.తనను తాను మొండి వాడిగా తిరుగులేని ప్రజా నాయకుడిగా ఊహించుకున్నచింతమనేనికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అడ్డు అదుపు లేకుండా అన్ని వ్యవహారాలు నడిచాయి.

అయితే ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో చింతమనేనికి చుక్కలు మొదలయ్యాయి.

  పాత పెండింగ్ కేసులు అన్నిటిని పోలీసులు తవ్వి తీస్తూ ఆయనను జైలుకు పంపారు.సెప్టెంబర్ 11వ తేదీన అరెస్టయిన ఆయనపై ఒకటి తరువాత మరో కేసు బయటకు తీస్తూ జైలులోనే ఉండేలా ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నారు.ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా గా తమ పార్టీ నాయకులను ఇబ్బందులు పెడుతోందని టిడిపి ఆరోపణలు చేస్తుంటే ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుందని, కొత్తగా తామేమీ కేసులు పెట్టలేదని, పాత కేసులనే పోలీసులు బయటకు తీస్తున్నారని ప్రభుత్వం వాదిస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే తాను ఇటువంటి కష్టాల్లో ఉంటే పార్టీ నుంచి స్పందన నామమాత్రంగానే ఉందని, తనుకు మనోధైర్యం కల్పించాల్సిన పార్టీ అగ్ర నాయకులు దూరం దూరంగా జరుగుతున్నారని చింతమనేని తన సన్నిహితులు కొంతమంది దగ్గర వాపోతున్నారట.

  చింతమనేని పై దాదాపు 66 కేసులు ఉండగా, ప్రస్తుతం 22 కేసులు దర్యాప్తు లో ఉన్నాయని పోలీసులు ప్రకటించారు.చింతమనేని పై అనవసరంగా అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదని, పాత కేసుల్లోనే ఆయన అరెస్ట్ అయ్యారని ఏలూరు రేంజ్ డీఐజీ ఏ ఎస్ ఖాన్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు అప్పుడే జైలు నుంచి బయటకు వస్తారా అనే అనుమానం ఆయన సన్నిహితుల్లో వ్యక్తం అవుతోంది.

ఇప్పటివరకు టిడిపి అధినేత చంద్రబాబు కానీ, ఆ పార్టీ సీనియర్లు గాని చింతమనేని ని గాని, ఆయన కుటుంబ సభ్యులను గాని పరామర్శ చేయకుండా దూరంగా ఉండడంపై చింతమనేని, ఆయన అనుచరులు టిడిపి అధిష్టానంపై రగిలిపోతున్నారు.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు