కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలపై చర్యలేవీ...? - సామాజిక కార్యకర్త జలగం సుధీర్

సూర్యాపేట జిల్లా:కోదాడ ఆర్డీవో ఆదేశాలను అధికారులు బేఖాతర్ చేస్తున్నారని కోదాడ సామాజిక కార్యకర్త జలగం సుధీర్ అన్నారు.

మంగళవారం కోదాడలో ఆయన మాట్లడుతూ కోదాడ పెద్ద చెరువును దర్జాగా కబ్జా చేస్తున్న వారి నుండి చెరువును కాపాడాలని అఖిలపక్షం నిరసనకు దిగినఅనంతరం కోదాడ ఆర్డీవో కిషోర్ బాబు స్పందించారని అన్నారు.

సుమారు సంవత్సరం క్రితం ఇరిగేషన్,రెవెన్యూ మరియు మునిసిపల్ అధికారులతో క్షేత్రస్థాయిపరిశీలన చేసి,పెద్ద చెరువు కబ్జాలకు గురైన విషయం నిజమేనని గుర్తించారని అన్నారు.పెద్ద చెరువు కబ్జాల నివారణకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ,మున్సిపల్ అధికారులను ఆదేశించారని చెప్పారు.

ఏడాది గడిచినా కానీ, ఫెన్సింగ్ వేసే పరిధి తమది కాదని ఆ 3 శాఖల అధికారులు దాటవేస్తున్నారని అన్నారు.గట్టిగా అడిగితే మా శాఖలో సరిపడా నిధులు లేవని చెప్తున్నారని అన్నారు.

ఇప్పటికైన ఈ 3 శాఖల అధికారులకు వారివారి బాధ్యతలను గుర్తు చేస్తూజిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోని, తద్వారా కోదాడ పెద్ద చెరువును కాపాడాలని కోరారు.

Advertisement
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

Latest Suryapet News