రాష్ట్రాలు ఇష్టానుసారంగా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయవద్దన్న నీతి అయోగ్‌

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ 19కు వ్యాక్సిన్‌ తయారు చేసే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ ను ప్రకటించింది.

వ్యాక్సిన్‌ను తమ దేశంలో ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యింది.మరికొన్ని దేశాలు కూడా కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

ఇలాంటి సమయంలో భారతదేశంలోని రాష్ట్రాలు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఇతర దేశాలతో కరోనా వ్యాక్సిన్‌ గురించి ఒప్పందాలు చేసుకోవద్దంటూ కేంద్ర ప్రభుత్వం మరియు నీతి అయోగ్‌ స్పష్టం చేసింది.కరోనా వ్యాక్సిన్‌ పై ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత చేపట్టాల్సిన విధి విధానాలను నీతి అయోగ్‌ ఇప్పటికే ఖరారు చేసింది.

దేశం మొత్తం కూడా ఒకే విధమైన వ్యాక్సిన్‌ను వినియోగించాలనేది నీతి అయోగ్‌ అభిప్రాయం.అందుకే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఒప్పందాలు చేసుకోవద్దంటూ హెచ్చరించింది.

Advertisement

ఈ ఆదేశాలు ఎవరు పాటించకున్నా కూడా కఠిన చర్యలు తప్పవంటూ ఈ సందర్బంగా హెచ్చరించడం జరిగింది.రష్యాకు చెందిన వ్యాక్సిన్‌ విషయంలో భారత్‌ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాని కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆ వ్యాక్సిన్‌ కోసం చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి.అందుకే నీతి అయోగ్‌ ఈ విధంగా స్పందించి ఉంటుందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు