వీఆర్ఏ శవాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు.

 Ongol, Corona, Peshent, Die-TeluguStop.com

ఇంకా కరోనా కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియల గురించి వర్ణరహితం.అందరు ఉన్న దగ్గరికి రాలేని పరిస్థితి.

ఒంగోలు జీజీహెచ్‌లో ఓ వ్యక్తి శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన కలకలం రేపుతుంది.అయితే ఈ సంఘటనకు సంబంధించిన సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్రగుంటకు చెందిన రిటైర్డ్ వీఆర్ఏ కాంతారావు కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడ్డారు.ఆయన కరోనా చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్‌లో చేరి చికిత్స తీసుకున్నారు.అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశారు.

అయితే ఒంగోలు రిమ్స్‌ ఆవరణలో కరోనా మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు అని పత్రికల్లో కథనాలు వచ్చాయి.దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆ మృతదేహం ఎవరిదా అని ఆరా తీయగా చివరకు కాంతారావుగా గుర్తించారు.

అయితే కరోనా రోగుల పట్ల ఒంగోలు రిమ్స్‌ అధికారులు ఎంత నిర్లక్ష్యం చుపిస్తున్నారో చెప్పటానికి కాంతారావు మృతదేహమే అందుకు సాక్ష్యం.అంతేకాదు వైద్యుల నిర్లక్ష్యం పట్ల చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.

ఈ వార్తపై వెంటనే టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి స్పందించారు.ఆసుపత్రిలో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రోగులకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.అంతేకాకుండా మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube