చైతన్య చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక

మెగా ఫ్యామిలీ కొణిదెల నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అత్తారింట్లో అడుగుపెట్టిన నిహారిక బాధ్యతలను మోస్తూ.

సోషల్ మీడియాలో కూడా బాగా బిజీ అవుతుంది.ఇటీవలే తాను తన అత్తారింట్లో చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తన భర్త చైతన్య తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది.2016లో ఒక మనసు సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైంది.అంతే కాకుండా తమిళంలో కూడా ఓ సినిమాలో నటించింది.

బుల్లితెర లో ప్రసారమైన రియాల్టీ షో డీ జూనియర్స్ లో కూడా పాల్గొంది.ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్ 9న ఉదయపూర్ లో ని కుటుంబ సభ్యులకు నిహారిక, చైతన్య పెళ్లి జరిగింది.

పెళ్లి వేడుకలు ఘనంగా ఐదు రోజుల పాటు జరగగా పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇదిలా ఉంటే చైతన్య నిహారికు.

Advertisement

ప్రేమ సందేశం పంపినందుకు భావోద్వేగాలకు గురైన వీడియో వైరల్ గా మారింది.

ఇటీవలే నిహారిక ఓ వీడియోను షేర్ చేయగా అందులో పెళ్లి వేడుకలు మొదలు నుంచి సంతోషంగా ఉన్నా నిహారిక పెళ్లి కూతురు అవుతున్న సమయంలో.తన కాబోయే భర్త చైతన్య పంపిన సందేశం తో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రియమైన నిహా.

‌ వివాహబంధంతో మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుది శ్వాస వరకు గుర్తుపెట్టుకుంటాను.30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయాను నిన్ను కలిసిన తర్వాతే అర్థమయింది.అలాగే నేను నీ కోసమే పుట్టానని నా జీవితానికి అర్థం నువ్వే నని తెలిసింది.

అంటూ చైతన్య పంపగా నిహారిక కన్నీళ్లు పెట్టుకుంది.చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితా హత్తుకొని కన్నీరు పెట్టుకుంది.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు