వెబ్ సీరీస్ మోజులో నిహారిక..!

మెగా డాటర్ గా ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఓ పెద్ద ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా వచ్చి అందరికి షాక్ ఇచ్చింది.

అయితే మొదటి సినిమా ఫలితం జీర్ణించుకోలేని నిహారిక కాస్త ఎక్కువ బాధపడ్డట్టు తెలిసిందే.

సినిమా చేయడానికి ముందే ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సీరీస్ తో ఫేమస్ అయిన నిహారిక ఆ సీరీస్ లో తన నటనకు మంచి మార్కులే సంపాదించింది.ఇక ఆ తర్వాత ఈటివి ఢీ జూనియర్స్ తో యాంకర్ గా కూడా అవతారమెత్తేసింది.

ఇక ఇన్ని చేసినా మొదటి సినిమా ఫలితం నిరాశ పరచడంతో నిహారిక మళ్లీ ఓ వెబ్ సీరీస్ చేయాలని ఆరాటపడుతుందట.ఓ సినిమాలో హీరోయిన్ గా నటించి మళ్లీ వెబ్ సీరీస్ లో నటిస్తే అంత క్రేజ్ ఉండదని మెగా బ్రదర్ నాగబాబు సలహా ఇస్తున్నా అవేవి పట్టించుకోకుండా మళ్లీ ముద్దపప్పు ఆవకాయ్ లానే మరో వెబ్ సీరీస్ ను స్టార్ట్ చేయబోతుందట నిహారిక.

మరి వెబ్ సీరీస్ మోజులో ఉన్న నిహారిక తీసుకున్న డెశిషన్ కరెక్టా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.ఇక ఓ పక్క తన రెండో సినిమా కథా చర్చల్లో కూడా నిమ్మగ్నమై ఉందట నిహారిక.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20 

తాజా వార్తలు