మనం ఏదైనా కోరిక కోరుకొని పెద్దవారికి నమస్కారం చేస్తే వారు తథాస్తు అంటే ఆ కోరిక నెరవేరుతుందని భావిస్తాం.అయితే దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం.
సాయం సంధ్యవేళల్లో తధాస్తు దేవతలు సంచారం చేస్తారని అంటుంటారు.ఆ సమయంలో చెడు మాటలు లేదా చెడు ఆలోచనలు చేస్తే జరుగుతాయని అంటారు.
మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాటలను పదే పదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తధాస్తు అంటూ ఉంటారు.వీరినే తధాస్తు దేవతలు అంటారు.
ఆరోగ్యం బాగానే ఉన్నప్పుడు కూడా అనారోగ్యంతో వున్నామని తరచూ అంటూ వుంటే నిజంగానే అనారోగ్యం వస్తుంది.అందువలన తనకున్న స్థితి గతుల గురించి అసత్యాలు, చెడుమాటలు మాట్లాడటం మంచి పద్దతి కాదు.
అలాగే మనకు ఎంత డబ్బు ఉన్నా లేదని అంటే కూడా డబ్బు పోతుంది.కాబట్టి ఎల్లప్పుడూ మంచి మాటలను మాత్రమే మాట్లాడాలి.
అంతేకాక మంచి మాటలను మాట్లాడటం వలన అంతా మంచే జరుగుతుంది.