ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప.
ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఎక్కడ విన్న పుష్ప సాంగ్స్ నే వినిపిస్తున్నాయి.ఏ ఇండస్ట్రీ చూసిన పుష్ప మ్యానియానే నడుస్తుంది.
ఇక ఊ అంటావా.ఊఊ అంటావా మామ సాంగ్ ఈ సినిమాకే హైలెట్.
పుష్ప సినిమాలో ఈ పాటకు స్టార్ హీరోయిన్ సమంత ఆడిపాడిన విషయం తెలిసిందే.ఈమె ఈ పాటతో సౌత్ ఇండియన్ కాదు నార్త్ ఇండియాను కూడా ఊపేసింది.
ఈ పాటకు సోషల్ మీడియాలో కొన్ని వందల మంది డ్యాన్స్ స్టెప్పులు వేసి వీడియోలు పోస్ట్ చేసారు.తాజాగా బాలీవుడ్ నవ వధువు ఈ పాటకు ఆడిపాడింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.బాలీవుడ్ నటి కరిష్మా తన్నా వ్యాపారవేత్త వరుణ్ బెంగేరా ను ఫిబ్రవరి 5న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ముంబై లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గర బంధువులు, ప్రముఖ సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు.గ్రాండ్ దుస్తులలో పెళ్లి జరుపుకున్న వీరి ఫోటోలు సోషల్ మీడియాలో నిన్నటి నుండి వైరల్ అవుతూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే ఈ శనివారం రాత్రి వారి రెసెప్షన్ జరగగా అందులో కరిష్మా పుష్ప సినిమాలోని ఊ అంటావా.
ఊఊ అంటావా మామ సాంగ్ హిందీ వర్షన్ కు స్టెప్పులు వేసి నవ వధువు ఇరగ దీసింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈమె సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
గ్రాండ్ మస్తీ, సంజు వంటి సినిమాల్లో ఈమె మెరిసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy