విజయనగరం జిల్లాలో రామతీర్థం లో జరిగిన సంఘటన కొన్ని రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటన నువ్వానేనా అన్నట్టుగా పరిస్థితులు దారితీశాయి.
ఇదిలా ఉంటే విగ్రహాలు ధ్వంసం కావడంతో వాటి స్థానంలో కొత్త విగ్రహాలకు వైసీపీ ప్రభుత్వం ఆర్డర్ చేయడమే కాక త్వరగానే ఆ కొత్త విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం చేపట్టడానికి రెడీ అయ్యింది.
ఈ క్రమంలో కొత్త విగ్రహాలు తిరుపతిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాలను తయారు చేశారు.శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలను పీఠంతో కలిపి వేర్వేరుగా కృష్ణశిల రాతితో వీటిని మలిచారు.టీటీడీ అధికారులు తాజాగా ఈ కొత్త విగ్రహాలు తయారు చేసి విజయనగరం జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారు.
ఇదిలా ఉంటే రామతీర్థం విగ్రహాల ధ్వంసం ఘటనకి సంబంధించిన కేసు విషయంలో విచారణ వేగవంతం చేసింది ఏపీ పోలీస్ యంత్రాంగం. మరోపక్క నిందితులను గుర్తించడానికి సీట్ ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.