ఆరోహి లవర్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్.. ఆమె ఎంట్రీకి ఇప్పుడు ఉన్నదానికి సంబంధం లేదంటూ?

బిగ్ బాస్ ప్రేమికులు బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు.

ఇటీవలే మొదలై నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది.

కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ షో ప్రేక్షకులను అనుకున్న విధంగా మెప్పించలేకపోతోంది.గత సీజన్ల కంటే ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ను కాస్త ఎక్కువగానే ఊహించుకున్నారు ప్రేక్షకులు.

కానీ ప్రేక్షకుల ఆశలు మొత్తం అసలు అవుతున్నట్లుగా తెలుస్తోంది.అలాగే హౌస్ లో గొడవలు అలకలు, ప్రేమలు ఇలా ప్రతి ఒక్క అంశం ఉన్నప్పటికీ ఈసారి ఈ సీజన్ కు అంతగా ఆదరణ లేదనే చెప్పవచ్చు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో జంటలు అనగానే ఆర్జె సూర్య, ఆరోహిల పేర్లు వినిపిస్తున్నాయి.జంట అనగానే వీళ్ళు పేర్లు వినిపించినప్పటికీ వారు మాత్రం లవ్ కాదు అని చెబుతున్నారు.

Advertisement
Netizens Fires On Arohi Rao And Rj Surya Behavior In The House Details, Arohi Ra

కానీ హౌస్ లో వాళ్లు ప్రవర్తించే తీరు మొత్తం లవర్స్ లాగే అనిపిస్తోంది.ఇక టాస్కులలో కానీ, తినడంలో కానీ అన్నిటిలో కూడా ఇద్దరూ కలిసి చేస్తారు కానీ చివరికి లవ్ అంటే మాత్రం నో అంటున్నారు.

వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి హౌస్ లోని కంటెస్టెంట్లు అలాగే హోస్ట్ నాగార్జున అడిగినప్పటికీ వారు మాత్రం ఏమీ లేదని చెబుతున్నారు.

Netizens Fires On Arohi Rao And Rj Surya Behavior In The House Details, Arohi Ra

ఆ తర్వాత వారిద్దరు క్లోజ్ గా కనిపించిన ఫోటోని చూపించడంతో వెంటనే సూర్య నందు ఏమైనా ఫీల్ అయి ఉంటాడా అని ప్రశ్నించాడు.అయితే అప్పుడు నందు ఎవరు అన్నది ప్రేక్షకులు జుట్టు పట్టుకొని పీక్కున్నారు.అని ఆ నందు ఎవరు అన్నది ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

నందు ఎవరో కాదు ఆరోహి లైఫ్ లో ఉన్న స్పెషల్ పర్సన్.మరి ఆరోహి లైఫ్ లో నందు స్పెషల్ పర్సన్ అయితే మరి సూర్య ఎవరు? ఈ ప్రశ్నకు ఆరోహి మాత్రమే క్లారిటీ ఇవ్వాలి.ఇకపోతే ఆరోహి గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తుండడంతో నైటిజన్స్ ఆమె ఎంట్రీకీ ఇప్పుడు ఉన్న దానికి సంబంధం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు