నెట్‌ఫ్లిక్స్‌ వినియోగాదారులా? అయితే, ఇప్పుడు ఆ పని చాలా తేలిక!

గతకొంతకాలంగా చూసుకుంటే ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌( Netflix ) గడ్డు పరిస్థితులను చూస్తోంది.

ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ఇక్కడ తన సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తోంది.

ఇందులో భాగంగా యాప్‌లో సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగు పరిచి మరింతమందిని ఆకట్టుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక ఫీచర్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

మొబైల్ యూజర్ల కోసం మై నెట్‌ఫ్లిక్స్( My Netflix ) అనే కొత్త పర్సనలైజ్డ్ ట్యాబ్‌ను పరిచయం చేసింది.ఇది సబ్‌స్క్రైబర్లు ఇంతకు ముందు ఇంటరాక్ట్ అయిన టైటిల్స్ కనుగొని స్ట్రీమ్ చేయడాన్ని ఇపుడు చాలా తేలిక చేస్తుంది.

ఈ పర్సనలైజ్డ్ హబ్, యూజర్ల అభిరుచికి అనుగుణంగా కొత్త కంటెంట్‌ను చూపిస్తుందన్నమాట.

Advertisement

నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫీచర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడానికి వన్-స్టాప్ షాప్‌గా పని చేస్తుంది.మై నెట్‌ఫ్లిక్స్‌ ట్యాబ్‌ నచ్చిన కంటెంట్ వెతుక్కునే విషయంలో సబ్‌స్క్రైబర్ల సమయాన్ని తగ్గిస్తుంది.సబ్‌స్క్రైబర్ల డౌన్‌లోడ్స్‌, లైక్ చేసిన వెబ్ సిరీస్‌లు లేదా సినిమాలు, మై లిస్ట్‌లో సేవ్ అయిన షోలు, చూడటం పూర్తి చేయని షోల రిమైండర్లు అన్నీ ఈ ట్యాబ్‌లో ఉంటాయి.

కాగా ఈ స్పెసిఫికేషన్ ప్రస్తుతం ఆపిల్ ఐఓయస్ మొబైల్స్‌లో అందుబాటులో ఉంది.ఆగస్టు ప్రారంభంలో ఆండ్రాయిడ్ మొబైల్‌ యూజర్లకు( android mobile users ) లాంచ్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ ట్యాబ్ ముఖ్యంగా 4 విభాగాలుగా పనిచేస్తుంది.మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి.ఒకటి డౌన్‌లోడ్స్‌ సెక్షన్ అనేది ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసిన అన్ని టైటిల్స్ లిస్ట్ చేసి చూపిస్తుంది.

రెండవది థంబ్స్ అప్.( Thumbs up ) ఇది మీరు థంబ్స్ అప్ ఇచ్చిన అన్ని టైటిల్స్ లిస్ట్ చేసి డిస్‌ప్లే చేస్తుంది.మూడవ మై లిస్ట్‌ సెక్షన్ అనేది మై లిస్ట్‌లో సేవ్ చేసిన అన్ని టైటిల్స్ లిస్ట్‌ చేస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

నాల్గవ విభాగం వచ్చి రిమైండర్లు. ఈ సెక్షన్ రిమైండర్లను సెట్ చేసిన అన్ని టైటిల్స్ లిస్ట్‌ చేస్తుంది.

Advertisement

నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌లోని డౌన్‌లోడ్స్‌ ట్యాబ్‌ స్థానంలో మై నెట్‌ఫ్లిక్స్ ట్యాబ్‌ను ప్రవేశపెట్టిందని గుర్తుపెట్టుకోవాలి.ఈ ట్యాబ్ సబ్‌స్క్రైబర్లకు అల్గారిథమ్-బేస్డ్ సజెషన్స్‌ను చూపించదు.

అందుకు బదులుగా సబ్‌స్క్రైబర్ల ఇంటరాక్టివ్ యాక్షన్స్ ఆధారంగా పర్సనలైజ్డ్ కంటెంట్‌ను చూపిస్తుంది.తద్వారా బ్రౌజింగ్ సమయాన్ని చాలావరకు తగ్గిస్తుంది.

తాజా వార్తలు