నెల్లూరు : ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంశాఖకి లేఖ రాసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు : ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంశాఖకి లేఖ రాసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరసనలకు సిద్దమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ నెల 17న కలెక్టరేట్, 25న ఆర్ అండ్ బీ కార్యాలయం వద్ద నిరసన ధర్నాకి రంగం సిద్ధం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్.

ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి లేఖ రాస్తున్నా ఆయన అపాయింట్మెంట్ దొరకాక నేరుగా కలిసి మాట్లాడుతాను రాష్ట్ర ప్రభుత్వం కూడా తిట్లు, శాపనార్ధాలు పెట్టడం కాదు మీరు కూడా కేంద్రానికి దర్యాప్తు చేయాలని లేఖ రాయండి రూరల్ లో ప్రజాసమస్యలు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజాసమస్యలపై పోరాడాను స్వయంగా ముఖ్యమంత్రి గారికే చెప్పాము, ఆయనే సంతకాలు పెట్టారు.

గత ప్రభుత్వంలో భూగర్భ డ్రైనేజి, త్రాగునీరు కోసం రోడ్లు ధ్వంసం చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్ల గురించి మంత్రి బొత్స కి వినతులు ఇచ్చా కాంట్రాక్టర్ కి గట్టిగా చెప్పి 10 కోట్లు ఇస్తే రూరల్ లో రోడ్లు పూర్తవుతాయని అడిగా డికేడబ్ల్యూ నుంచి పొదలకూరు రోడ్డులో వేసిన రోడ్డు ఒకవైపు వేశారు.ప్రమాదాలు జరుగుతున్నాయి పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి ప్రధానమైంది.

రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి సీఎం గారికి ఈ ప్రాంతాన్ని చూపించాం, 28 కోట్లు నిధులు విడుదల చేస్తున్నాం అని చెప్పారు ఇవాల్టికి టెండర్లు పిలవలేదు, మూడు నియోజకవర్గాలు కలిసే రోడ్డు ఇది గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరాం, ముస్లిం, దళితుల, గిరిజనుల విద్యార్థులకి చదువులు ఉంటాయి చిన్న చిన్న పనులు చేస్తే సమస్య పరిష్కారం అవుతాయి వావిలేటిపాడు పేదలకు ఇచ్చిన లే ఔట్ లో సమస్యలు ఉన్నాయి, ఇళ్లపాట్టాలు కోసం అనేక సార్లు అడిగా బిసి భవన్ శంకుస్థాపనకే పరిమితం అయింది ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ సుందరీకరణకి 15 కోట్లు కేంద్ర నిధులు విడుదల అయ్యాయి నా మీద కోపంతో పనులు ఆపేయవద్దు, త్వరగా పనులు చేపించండి బారా షాహిద్ దర్గాలో ఓ మసీదు ఉండాలని, దర్గా అభివృద్ధి జరగాలని ముస్లింల కోరికన్ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈద్గా నిర్మాణం చేయలేకపోతే.కమిషనర్ తో మాట్లాడి ఆర్చి, దర్గా నిర్మాణం చేపట్టాం రొట్టెల పండుగ జరిగే దర్గాలో 15 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ఆగస్టు లో జీఓ ఇచ్చారు ఈ నిధుల కోసం దనుంజయ రెడ్డి గారి దగ్గరకి వెళ్ళా.ఉదయం 10.30 నుంచి రాత్రి 8 వరకు భోజనం కూడా చేయకుండా ఆయన ఛాంబర్ వద్ద ఎదురు చూసా జనవరి 2న సీఎం గారిని కలిస్తే వేగవంతంగా పనులు చేయాలని సీఎం గారు దనుంజయరెడ్డి గారిని ఆదేశించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు.ఇది దారుణం కదా ఈ సమస్యల పరిష్కారం కోసం అధికార ఎమ్మెల్యే గా అధికారుల చుట్టూ తిరిగాను ఆరోజు సమస్యల కోసం పోరాటం చేశా, ప్రజల పక్షాన ఇవాల పోరాటం చేస్తా కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య అలానే ఉంది.10 కోట్ల నిధులు విడుదల చేసారు సగం పనులు కూడా జరగలేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేయలేదు ఈ నెల 17న ఉదయం 11 గంటలకి జిల్లా కలెక్టరేట్ వద్ద ముస్లిం సోదరులతో కలిసి నిరసన ధర్నా చేపడుతాం 25వ తేదీన ఆర్అండ్ బి కార్యాలయం వద్ద రోడ్ల కోసం ధర్నా చేస్తాం ఈ లోపే నిధులు విడుదల చేస్తే మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఆలోచిస్తాం నాకు అనేక బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి, చెప్పలేని భాషలో దుర్భాషలు ఆడుతున్నారు .

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు