అధికారుల నిర్లక్ష్యం.. అందకారంలో ఆఖరి మజిలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా : మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో( funeral ) ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వైకుంఠధామాల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే కొందరు అధికారుల నిర్లక్ష్యంతో ఆఖరి మజిలీకి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

సిరిసిల్ల ( Sircilla )పట్టణంలోని నెహ్రూ నగర్ వైకుంఠధామానికి గత రెండు నెలలుగా విద్యుత్ సరఫరా లేదని స్థానికులు అంటున్నారు.ఎవరైనా చనిపోతే అంధకారంలో ఆఖరి మజిలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెల్ ఫోన్ లైట్‌ల సహాయంతో అంత్యక్రియలు చేసుకుంటున్నామని, అంతేకాకుండా మెయిన్ రోడ్ నుండి వైకుంఠధామం వరకు రోడ్డంతా బురదమయంగా మారిందని మండిపడుతున్నారు.మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ కనెక్షన్ ( Electrical connection )ఇప్పించి, బురదమయంగా మారిన రోడ్డుకు మరమత్తు పనులు చేయాలని కోరుతున్నారు.

Advertisement
జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు సిబ్బందికి '' 78'' వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Latest Rajanna Sircilla News