వేప ఆకులతో ఇలా చేస్తే మ‌ధుమేహం దూరం?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ధుమేహం వ్యాధితో బాధ ప‌డుతున్న వారు అత్య‌ధిక సంఖ్య‌లో ఉన్నారు అన‌డంలో సందేహ‌మే లేదు.

దీర్ఘకాలిక వ్యాధి అయిన ఈ మ‌ధుమేహం మ‌నిషిని శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా కూడా కృంగ‌దీసేస్తోంది.

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌శైలి, వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం ఇలా వివిధ కార‌ణాల వ‌ల్ల మ‌ధుమేహం వ్యాధి బారిన ప‌డుతుంటారు.ఇక మ‌ధుమేహం వ‌చ్చిందంటే ఎన్నో జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.అయితే వేప ఆకులు మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి స‌హాయ‌ప‌డ‌ట‌మే కాకుండా. డ‌యాబెటిస్ రాకుండా కూడా వేప ఆకులు ఉప‌యోగప‌డ‌తాయి.

Advertisement

ఇంత‌కీ వేప ఆకుల‌ను ఎలా తీసుకోవాలి అన్న సందేహం వ‌చ్చే ఉంటుంది.మ‌రి ఆ విష‌యం కూడా తెలిసేసుకోండి.

వేప ఆకుల‌ను నీటిగా శుభ్రం చేసుకుని.ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి.

ఆ పొడిలో కొద్దిగా వాట‌ర్ క‌లిపి మందు బిల్ల‌లా తీసుకోవాలి.

లేదా ఒక గ్లాస్ వాట‌ర్‌లో కొన్ని వేప ఆకులు వేసి బాగా మ‌రిగించాలి.అలా మ‌రిగించిన నీటిని వాడ‌గ‌ట్టుకుని ప్ర‌తి రోజు ఉద‌యం పూట తీసుకోవాలి.ఇలా చేసినా.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

మ‌ధుమేహాం వ్యాధిని నివారించుకోవ‌చ్చు.వేప ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, గ్లైకోసైడ్లు, ట్రైటెర్పెనాయిడ్, ఫ్లేవనాయిడ్ల వంటి సమ్మేళనాలు ఉంటాయి.

Advertisement

ఇవి గ్లూకోజ్ పెరుగుద‌ల‌ను త‌గ్గించి.మ‌ధుమేహం వ్యాధిని నియంత్రిస్తాయి.

అలాగే వేప ఆకుల్లో విట‌మిన్ సి కూడా పుష్క‌లంగా ఉంటుంది.అందువ‌ల్ల‌, ఉద‌యం పూట‌ వేప ఆకులు న‌మిలి.మింగేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి.వివిధ జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

ఇక కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, జీర్ణ క్రియ మెరుగు ప‌ర‌చ‌డంలోనూ వేప ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, వేపాకులు మ‌ధుమేహం ఉన్న వారే కాకుండా.

ఎవ్వ‌రైనా వైపాకుల‌ను తీసుకోవ‌చ్చు.

తాజా వార్తలు