దక్షిణ సినీ ఇండస్ట్రీ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటుతూ టాప్ రెమ్యునరేషన్ అందుకుంటుంది లేడీ సూపర్ స్టార్ నయనతార.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్న నయన్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.
హీరోలకు సైతం అన్ని విషయాల్లో పోటీగా నిలుస్తూ సూపర్ స్టార్ అనిపించు కుంటుంది.
ఈమెకు నచ్చకపోయినా.
ఈమె కండిషన్స్ ఒప్పుకోక పోయిన ఎంత స్టార్ పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.ఎన్ని కోట్లు ఆఫర్ ఇచ్చిన నిర్మొహమాటంగా నో అని చెప్పేస్తుంది.
ఇక దర్శక నిర్మాతలు కూడా ఆమె ఎన్ని కండిషన్స్ పెట్టినా ఓకే చెబుతూ వస్తున్నారు.ప్రెజెంట్ ఈమె టైం నడుస్తుంది కాబట్టి అలా చేయాల్సి వస్తుంది.
ఇదిలా ఉండగా వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది.
తాజాగా ఈమె నటించిన మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘కనెక్ట్’.
ఈ సినిమా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాను అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయగా తాజాగా తెలుగు, తమిళ్ ట్రైలర్స్ రిలీజ్ చేసారు మేకర్స్.
ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది.ట్రైలర్ మొత్తం పరిశీలిస్తే.
ముందు అంతా నయన్ ఫ్యామిలీ తో డీసెంట్ గా కనిపిస్తే.ఆ తర్వాత మాత్రం అంతా ఆసక్తిగా సాగిపోయింది.
ఒక డెవిల్ గేమ్ ను చూపిస్తున్నారు అనేలా ఉంది.మరి ఈ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ ను చూస్తుంటే ఈసారి నయన్ హిట్ కొట్టేలానే కనిపిస్తుంది.నయన్ తో పాటు సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా తన నటనతో ఆకట్టు కున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలంటే డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే.