ఇన్నాళ్లు ఆగారు ఇంకా కొంత కాలం వెయిట్‌ చేయలేరా?

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార గత కొంతకాలంగా దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.వీరిద్దరి ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లింది.

ప్రస్తుతం వీరిద్దరు సహజీవనమే సాగిస్తున్నారు.హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న కారణంగా పెళ్లి వాయిదా వేస్తూ వచ్చిన నయనతార ఎట్టకేలకు పెళ్లికి సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది.

అనేక పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో విఘ్నేష్‌ శివన్‌తో పెళ్లికి నయన్‌ సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.ఇద్దరు విడిపోయారు అంటూ ఆమద్య వార్తలు వచ్చాయి.

వాటిని కొట్టి పారేస్తూ స్వయంగా విఘ్నేష్‌ శివన్‌ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేశాడు.ఇద్దరు అద్బుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

Advertisement

ఒకరి స్నేహంలో మరొకరం అన్నట్లుగా ఆయన కామెంట్‌ పెట్టాడు.ఈ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వడంతో పెళ్లి త్వరలోనే జరుగబోతుందని అంతా అనుకుంటున్నారు.

తమిళ సినీ వర్గాల్లో వీరిద్దరి పెళ్లి గురించి ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం వీరిద్దరు కూడా పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారట.త్వరలోనే పెళ్లి ప్రకటన వస్తుందని అంటున్నారు.

ఈ ఏడాదిలోనే వీరి వివాహం ఉంటుందని తెలుస్తోంది.అయితే కరోనాతో పరిస్థితులు గందరగోళంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వీరి వివాహం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇన్ని సంవత్సరాలు వెయిట్‌ చేశారు మరో ఏడాది వెయిట్‌ చేస్తే అందరి సమక్షంలో వైభవంగా వివాహం చేసుకోవచ్చు కదా అంటున్నారు.

బడా హీరోలకోసం బలగం వేణు వెంపర్లాట... అదే ఆలస్యం చేస్తోందా?
Advertisement

తాజా వార్తలు