మొదటిసారి పిల్లలతో కలిసి ఓనం జరుపుకుంటున్న నయనతార దంపతులు.. వైరల్ ఫొటోస్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార( Nayanthara ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలో సూపర్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

నటనపరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార అందం పరంగా కూడా ఎంతోమందిని ఫిదా చేసింది.ఇప్పటికీ ఆమె అందంలో ఎటువంటి మార్పు లేదని చెప్పాలి.

రోజురోజుకు వయసుతో పాటు అందం కూడా పెంచుకుంటూ పోతుంది నయనతార.ఇక వయసు కనిపించకుండా అందంతో కవర్ చేస్తుంది.ఇక ఈమె నటిగా ఎంత మంచి పేరు సంపాదించుకుందో వ్యక్తిగతంగా అంతా హాట్ టాపిక్ గా నిలిచింది.

పెళ్లికి ముందు గతంలో నయనతార హీరో శింబు, ప్రభుదేవలతో గాఢంగా ప్రేమాయణం చేసింది.కానీ కొన్ని కారణాల వల్ల వాళ్లకు బ్రేకప్ చెప్పేసింది.ఆ సమయంలో ఈమె వార్తలు బాగా హాట్ టాపిక్ గా నిలిచినప్పటికీ కూడా.

Advertisement

అవకాశాలు మాత్రం అస్సలు తగ్గలేదు.

దర్శక నిర్మాతలు( Director Producers ) ఈమెకు పోటీపడి మరి అవకాశాలు ఇచ్చేవారు.అలా ఒక వైపు తెలుగులో, మరోవైపు తమిళంలో సినిమాలు చేస్తూ బాగా క్రేజ్ సంపాదించుకుంది.అదే సమయంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన విగ్నేష్ శివన్( Vignesh Sivan ) తో ఒక సినిమా చేయగా ఆ సమయంలో వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.

అలా చాలా వరకు విగ్నేష్ సినిమాలో నటించింది.అంతే కాకుండా వీరిద్దరు కొంతకాలం సహజీవనం చేసి కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుపుకున్నారు.ఏడాది తిరగక ముందే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

ఇక విగ్నేష్ పిల్లల బాధ్యతలతో పాటు తన సినిమా బాధ్యతలను కూడా చూసుకుంటున్నాడు.నయనతార కూడా ఒక వైపు సినిమాలను చేసి మరోవైపు ఫ్యామిలీని చూసుకుంటుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ఇక విగ్నేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

Advertisement

నయనతార సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు.తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన భర్త షేర్ చేసుకుంటూనే ఉంటాడు.అప్పుడప్పుడు పిల్లలకు సంబంధించిన ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటాడు.

అయితే మలయాళీ( Malayali ) వాళ్లకు ప్రత్యేకమైన పండుగ ఓనం సందర్భంగా.మలయాళీ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ఫొటోస్ పంచుకుంటున్నారు.

అయితే తాజాగా విగ్నేష్ కూడా ఓనం సందర్భంగా తన ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ పంచుకున్నాడు.తను, నయనతార తమ ఇద్దరి పిల్లలతో కలిసి పండగ సందర్భంగా సందడి చేసినట్లు కనిపించారు.

ఇక నలుగురు తెలుపు వస్త్రాలలో కనిపించారు.పిల్లలిద్దరి ముందు అరటాకులో భోజనాలు పెట్టగా.

పిల్లలను వెనకాల దింపిన ఫోటోలను పంచుకున్నారు.ఇక ఆ ఫోటోలు వైరల్ అవ్వగా నయనతార అభిమానులు ఆ ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు.

ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ దీవించారు.

తాజా వార్తలు