ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కారుమూరి అన్నారు.అడిగి అడిగి ధాన్యం కొన్నామన్న ఆయన చివరి గింజ వరకు కొంటామని తెలిపారు.
చంద్రబాబు పాలనలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని విమర్శించారు.టిడిపి పాలనలో రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే తాము 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు.ఈ మేరకు నాలుగు రోజుల్లోనే డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసామని పేర్కొన్నారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేశామని తెలిపారు.కానీ ప్రతిపక్ష నేతలు కుట్రపూరితంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం జగన్ తమకు మేలు చేశారని రైతులు కొనియాడుతున్నారని మంత్రి తెలిపారు.