వరద బాధితులకు సాయం చేసిన నయనతారపై తీవ్ర విమర్శలు.. ఆ తప్పు చేయడంతో?

లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

సినిమా సినిమాకు నయనతారకు క్రేజ్, పాపులారిటీ, రెమ్యునరేషన్ పెరుగుతుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

తాజగా తమిళనాడు రాష్ట్రంలో( Tamil Nadu ) వరదల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారనే సంగతి తెలిసిందే.ప్రజలు పడ్డ ఇబ్బందులు తన దృష్టికి రావడంతో నయనతార వరద భాధితులకు తన వంతు సహాయం చేశారు.

సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా సహాయం చేస్తే ప్రశంసలు వ్యక్తమవుతాయి.అయితే నయనతార విషయంలో మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

నయనతార తన వ్యాపారసంస్థ అయిన ఫెమీ9( Femi9 ) ద్వారా వరద బాదితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.దుస్తులు, ఆహారం, మెడిసిన్స్, పాలు, శానిటరీ న్యాప్ కిన్లను ఆమె అందించడం గమనార్హం.

Advertisement

నయనతార చేసిన సేవా కార్యక్రమాల( Service programs ) గురించి ప్రస్తావిస్తూ పలువురు అభినందనలు తెలియజేయగా సహాయ కార్యక్రమాల కోసం నయనతార ఫెమీ9 అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ లు ఉన్న వాహనాల ద్వారా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు.అయితే విపత్తుల సమయంలో సైతం నయన్ కంపెనీని పబ్లిసిటీ చేసుకోవడం ఎంతవరకు రైట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నయనతార రెమ్యునరేషన్ మాత్రం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.సీనియర్ హీరోయిన్ కావడం, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం ఆమెకు ప్లస్ అవుతోంది.నయనతార తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నయనతార రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతారేమో చూడాలి.నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న నయన్ కు కెరీర్ పరంగా కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.

నయన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు