చెమట ఎక్కువగా పడుతుందా..అయితే ఇలా చేయండి..!

కాలమేదైనా ఏ సీజన్లో ఉండే అనారోగ్య సమస్యలు ఆ సీజన్లో లో కచ్చితంగా ఎదురవుతూనే ఉంటాయి.

ముఖ్యంగా చెప్పాలంటే వేసవికాలం( Summer Season )లో సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకవైపు సూర్యుడి భగభగలు మరోవైపు వడగాలులు ప్రజలు వీటి ప్రభావంతో అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతూ ఉంటారు.అయితే కొందరిలో చెమట సమస్య ఎక్కువగా ఉంటుంది.

గాలికి కూర్చున్న కొంతమందికి చెమట, చికాకు అసలు వదలదు.అయితే ఎలాగో ఎండాకాలం కదా చెమట( Sweat ) అలాగే పడుతుందిలే అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే అది క్రమంగా మనల్ని డిహైడ్రేషన్ కి గురి చేసే అవకాశం ఉంది.కాబట్టి ఇలా ఎక్కువ చెమట పట్టడాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

Advertisement

ఈ క్రమంలోనే చెమట ఎక్కువగా పట్టడానికి గల కారణాలు, సహజసిద్ధమైన పరిష్కార మార్గాలు లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చెమట ఎక్కువగా( Excessive Sweat )పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.హార్మోన్ల స్థాయిలో మార్పులు, అధిక బరువు, మధుమేహం, ఆందోళన, కోపం, గుండె సంబంధిత సమస్యలు, మెనోపాజ్ ఇలా వివిధ కారణాల వల్ల చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది.కొంతమందికి చంకల్లో ఎక్కువగా చమట చెమట పడుతు ఉంటుంది.

అలాంటివారు ఈ చిన్న చిట్కాను పాటించడం మంచిది.కొద్దిగా కార్న్‌స్టార్చ్‌లో కాస్త బేకింగ్ సోడా, సరిపడినంత ఎసెన్షియల్ ఆయిల్ కలిపి పేస్ట్‌లా చేసి ఈ మిశ్రమాన్ని చంకల్లో అప్లై చేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచుకోవడం మంచిది.

ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేస్తే సరిపోతుంది.ఇలా తరచూ చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో అధిక చమట సమస్య దూరం అయిపోతుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ఇంకా వేడిని తగ్గించడానికి ఈ నియమాలను పాటించాలి.పచ్చిమిర్చి, మసాలాలు వంటి కొన్ని ఘాటేనా పదార్థాలు కూడా శరీరంలో అధిక వేడిని పుట్టించి ఎక్కువ చెమటను విడుదల ఎలా చేస్తాయి.కాబట్టి ఈ కాలంలో వాటిని వీలైనంత తగ్గించడం మంచిది.

Advertisement

కెఫీన్( Caffeine ) నాడీ వ్యవస్థను ప్రేరేపించి శరీరంలో అడ్రినలిన్ విడుదల చేస్తుంది.కాబట్టి సాధ్యమైనంత వరకు కాఫీ తీసుకోకపోవడమే మంచిది.

అలాగే ఒత్తిడి ఆందోళన వంటివి తగ్గించుకోవడం ముఖ్యం.అలాగే ఈ కాలంలో శరీరానికి గాలి తగిలేలా వదులుగా ఉండే దుస్తులను మాత్రమే ధరించడం మంచిది.

తాజా వార్తలు