చాలా కాలంగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో వైసీపీ అధిష్టానానికి తలనొప్పులు వస్తున్నాయి.ఆయన పార్టీ గీసిన గీత దాటుతూనే పార్టీలోనే ఉంటానంటూ ప్రకటిస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వైసీపీ ఉంది.
పార్టీ అనుమతి లేకుండా ఏ ఇతర పార్టీ నేతలను ఎవరినీ కలవడానికి కుదరదు అంటూ ఇప్పటికే ఎంపీలకు జగన్ గట్టిగానే క్లాస్ తీసుకున్నా నరసాపురం ఎంపీ రంగురామకృష్ణం రాజు అవేమి పట్టించుకోవడంలేదు సరికదా మరింతగా బీజేపీ నేతలతో సఖ్యతగా మెలుగుతున్నారు.అంతే కాదు తాజాగా బీజేపీ అగ్రనాయకులు, ఆ పార్టీ ఎంపీలకు కూడా విందు ఏర్పాటు చేసి భారీగానే ఖర్చు పెట్టారు.
అయితే ఈ విందు విషయంపై పార్టీకి కూడా సమాచారం లేదు.ఇలా ప్రతి విషయంలోనూ ఈ ఎంపీ గారి నిర్వాకం జగన్ కు ఇబ్బందికరంగా మారింది.
పార్టీలో ఉన్న వ్యక్తుల క్రమశిక్షణ విషయంలో జగన్ సీరియస్ గానే దృష్టిపెడుతుంటారు.కానీ రఘురామ కృష్ణం రాజు విషయంలో ఆ స్టెప్ జగన్ వేయలేకపోతున్నారు.
దీంతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నట్టుగా కనిపిస్తోంది.

ఇదే విషయమై తాజాగా స్పందించిన రఘురామ కృష్ణం రాజు తాను వైసీపీలో ఎవరి మాటా విననని, కేవలం జగన్ ఒక్కరి మాటే వింటాను అంటూ క్లియర్ గా చెప్పేశారట.మరెవరు చెప్పినా వినాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు.విజయసాయరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి కూడా ఇదే వర్తిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.అంతే కాదు జగన్‌కు, తనకు మధ్య గొడవలు పెట్టేందుకు ముగ్గురు, నలుగురు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ప్రకటించారు.
అయితే, సీత మీద రాముడికి అనుమానం ఉండొచ్చు కానీ, తన మీద మాత్రం జగన్‌కు ఏమాత్రం అనుమానం లేదని చెప్పుకొచ్చారు.తాను వైసీపీని వదిలేది లేదని, బీజేపీలో చేరేది లేదు అంటూ రఘురామకృష్ణంరాజు క్లియర్ గా చెప్పేసారు.

అదే సమయంలో తన వ్యక్తిగతమైన సంబంధాలు అన్ని పార్టీల వారితోనే కొనసాగిస్తానని ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పినా వినేది లేదు అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.వైసీపీలో నాకు ఒకే ఒక్కరు లీడర్ జగన్.ఆయన చెబితే ఓకే.ఇంకెవ్వరూ నాకు లీడర్లు లేరు.వాళ్లు చెప్పినా నేను వినను.ఒకరి చేత నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు.నాకు నీతులు చెప్పగలిగింది జగన్ ఒక్కరేనన్నారు.సుబ్బారెడ్డి చెప్పారని నోరు మూసుకుంటే నాకు ఓటు ఆయనొచ్చి వేస్తారా ? అంటూ ప్రశ్నించారు.మిమ్మల్ని పక్కన పెట్టేందుకు గోకరాజు గంగరాజు కుటుంబాన్ని వైసీపీలో చేర్చుకున్నారు కదా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎవరు పార్టీలో చేరినా పార్టీలో తన ప్రదన్యం తనకు ఉంటుందని, నేను వైసీపీలోనే ఉంటానని, వచ్చే ఎన్నికల్లోనూ జగన్ తనకు నరసాపురం నుంచి సీటు ఇస్తారంటూ రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు.