21 సంవత్సరాలకే కోట్లు సంపాదిస్తున్నాడు! పాఠాలు చెప్పినవారినే పనిలో పెట్టుకున్నాడు.! రియల్ స్టోరీ!!

అందరికి తల్లిదండ్రులు పేరు పెడితే అతనికి మాత్రం కంప్యూటరే పేరు పెట్టింది.కేవలం నామకరణతోనే ఆగక ఆ యువకుడి జీవిత చిత్రాన్నే మార్చేసింది.

 Inspiring Story Of Kannur Youngster Tnm Jawad-TeluguStop.com

సొంత ఇల్లు, ఖరీదైన బీఎండబ్ల్యూ కారుతో పాటు సంవత్సరానికి 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కంపెనికి యజమాని అయ్యేలా చేసింది.ఆసక్తి ఉన్న రంగాన్ని ఎన్నుకుంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మరోసారి రుజువు చేసాడు కేరళ కన్నూర్‌కు చెందిన 21 ఏళ్ల జవాద్.

కంప్యూటర్‌ పట్ల ఆ యువకుడికి ఉన్న ఆసక్తి వల్లే ఇదంతా సాధ్యమయ్యింది.

పేదరికంలో తన బతుకు పోరాటాన్ని మొదలుపెట్టిన ఈ కుర్రోడు తనకు ఇష్టమైన పనినే కెరీర్‌గా మలచుకుని తానేంటో నిరూపించుకున్నాడు.తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన కంప్యూటర్‌తో వెబ్ డిజైనింగ్‌ పై దృష్టి పెట్టాడు.TNM Online Solutions పేరుతో ఓ మల్టీ కోర్ ఐటీ సంస్థను ప్రారంభించిన జవాద్ పలువురికి ఉపాధి కల్పించటంతో పాటు ఏడాదికి రెండు కోట్లు అర్జిస్తున్నాడు.

ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది క్లయింట్స్ ఉన్నారు.

కేరళ ఉన్నార్‌కు చెందిన జవాద్‌ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.

జవాద్‌ తండ్రి దుబాయిలో బ్యాంక్‌ ఉద్యోగం చేసేవాడు.ఈ క్రమంలో ఓ సారి ఇండియా వచ్చినప్పుడు జవాద్‌కు కంప్యూటర్‌ను బహుమతిగా ఇవ్వడమే కాక దానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను కూడా పెట్టించాడు.

అదే జవాద్‌ జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది.అనాటి నుంచి కంప్యూటర్‌తో ప్రేమలో పడిపోయాడు జవాద్‌.

ఇక ఆరోజు నుంచి కంప్యూటర్‌కు బానిసయ్యాడు(మంచి వ్యసమే.).ఒక సారి తన పేరుతో జీమెయిల్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసే క్రమంలో కంప్యూటర్‌ జవాద్‌ పేరును ‘టీఎన్‌ఎమ్‌ జవాద్‌’గా సజెస్ట్‌ చేసింది.ఆ పేరే నేడు ఎన్నో ప్రభంజనాలు సృష్టిస్తోంది.

చిన్న వయసులోనే వెబ్‌సైట్‌లు రూపొందించడం ప్రారంభించాడు.ఈ క్రమంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్న కంపెనీని ప్రారంభించాడు.అలా పదో తరగతిలోనే 2,500 రూపాయల తొలి సంపాదనను అందుకున్నాడు జవాద్‌.ఒక్కసారిగా జవాద్‌ దగ్గర అంత సొమ్ము చూసిన అతని తల్లిదండ్రులకు భయమేసింది.తమ కుమారుడు ఏదైనా చెడ్డ పనులు చేస్తున్నాడేమోనని భయపడ్డారు.కానీ జవాద్‌ వారికి తాను ప్రారంభించిన వ్యాపారం గురించి వివరించాడు.

ఫేస్‌బుక్, ఆర్కుట్ వంటి వెబ్‌సైట్‌లు జవాద్‌‌ను మరింత ఆశ్చర్యానికి గురి చేసేవి.అసలు వెబ్‌సైట్ అనేది ఎలా పనిచేస్తుంది, వీటిని ఎలా తయారు చేస్తారు వంటి ప్రశ్నలు జవాద్‌ను ఎప్పటికప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉండేవి.

ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధాలను జవాద్ ఎప్పటికప్పుడు దుబాయ్ లో ఉన్న తన సోదరుని ద్వారా అడిగి తెలుసుకునే వాడు.

ఆ తర్వాత కుటుంబ సభ్యుల మద్దతుతో వెబ్‌ డిజైనింగ్‌ను మరింత బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు.కోర్సు అయిపోయిన తర్వాత తనకు వెబ్‌డిజైనింగ్‌ పాఠాలు చెప్పిన టీచర్లను తాను ప్రారంభించబోయే కంపెనీలో ఉద్యోగులుగా చేరమని కోరాడు.అందుకు వారు అంగీకరించడంతో వారిద్దరిని ఉద్యోగులుగా నియమించుకుని ‘టీఎన్‌ఎమ్‌ ఆన్‌లైన్‌ సొల్యూషన్న్‌’అనే వెబ్‌డిజైనింగ్‌ సంస్థను స్థాపించాడు.

ప్రారంభంలో కేవలం వెయ్యి రూపాయల తక్కువ ధరకే వెబ్‌సైట్లను రూపొందించేవారు.అయినా కూడా నెలకు కేవలం 2,3 ఆర్డర్‌లు మాత్రమే వచ్చేవి.ఒకానొక సమయంలో ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి జవాద్‌ తన అమ్మగారి బంగారు గాజులను కూడా కుదవపెట్టాడు.

క్లైంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ.

రెండేళ్ల నాటికి 100 వరకూ చిన్నా చితకా కంపెనీలు జవాద్‌ క్లయింట లిస్ట్‌లో చేరాయి.సరిగా ఇదే సమయంలో నూతన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఏర్పాటు చేసిన యస్‌ కేరళ సమ్మిట్‌లో జవాద్‌ పాల్గొన్నాడు.

ఈ సమ్మిట్ అతిని జీవితానికో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.ఆ సమ్మిట్లో తండ్రి పనిచేసిన మలయాళీ వార్తాపత్రికకు చెందిన విలేకరి ఒకరు జవాద్ వద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు.

ఆ వార్త అన్ని ఎడిషన్స్‌లోనూ ప్రచురితం అయ్యింది.ఆ క్లిప్పింగ్స్‌ను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో జవాద్ పోస్ట్ చేయటంతో పాటు ఒక్కసారికి అనూహ్యమైన స్పందన లభించింది.

దీంతో దేశవిదేశాల నుంచి జవాద్‌కు ఫోన్ కాల్స్ రావటం మొదలు పెట్టాయి.ఆ తరువాత నుంచి జవాద్ ఇంకా వెనక్కితిరిగా చూసుకోలేదు.

ప్రస్తుతం ‘టీఎన్‌ఎమ్‌ అకాడమీ’ని స్థాపించి ఆసక్తి ఉన్న వారికి వయసుతో సంబంధం లేకుండా వెబ్‌డిజైనింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నాడు.ఆసక్తి ఉన్న రంగంలో పట్టుదలగా ప్రయత్నిస్తే ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది జావేద్‌ జీవితం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube