జస్ట్ ఇన్ :: బాలకృష్ణ 100 లో నారా రోహిత్ !

బాలకృష్ణ వందవ సినిమా విషయంలో ఇంకా మీమాంస ఒదిలిపోలేదు.

తన ప్రతిష్టాత్మక 100 వ చిత్రం బాలయ్య ఎవరి చేతిలో పెడతాడు అనే విషయం మీద ఇంకా ఫాన్స్ లో రకరకాల ఊహనగాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రెండు మూడు సబ్జెక్ట్ లు చేతిలో పెట్టుకున్న నందమూరి అందగాడు ఒక సినిమాకి సంతకం పెట్టాల్సి ఉంది.కృష్ణ వంశీ విషయం లోనే బాలయ్య కూడా ఫుల్ ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుస్తోంది.

కృష్ణ వంశీ కూడా నవంబర్ వరకూ తన రుద్రాక్ష కోసం సమంత డేట్ లు దొరకడం కష్టం అవడం తో అంతవరకూ తన డ్రీం ప్రాజెక్ట్ పక్కకి పెట్టి బాలయ్య ప్రాజెక్టుపై బిజీగా వున్నారు.ఇటీవలే లేపాక్షి ఉత్సవాలకు కూడా వెళ్లివచ్చారు.

అక్కడ బాలయ్యతో కాస్సేపు డిస్కషన్ కూడా చేసినట్లు వినికిడి.ఇదిలా వుంటే ఆ కథలో వీలయితే, రెండు మంచి పాత్రలకు నారా రోహిత్, తారకరత్నలకు అవకాశం వుండేలా చూడమని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

కావాలని ఇరికించినట్లు కాకుండా, పాత్రోచితంగా, కథా పరంగా బాగుండేలా చూడమని చెప్పినట్లు తెలిసింది.ఆ విధంగా బాలయ్య వందో సినిమా కూడా మల్టీస్టారర్ అవుతుందన్నమాట.

ఈ మేరకు కృష్ణవంశీ కథపై కసర్తత్తు చేస్తున్నట్లు వినికిడి.

Advertisement

తాజా వార్తలు