పనిచేస్తారా పక్కనపెట్టాలా ? లోకేష్ వార్నింగ్స్ 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాగా యాక్టివ్ అయ్యారు.ఎంతగా అంటే పార్టీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే స్థాయికి.

ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషిస్తున్న లోకేష్ విస్తృతంగా ఏపీ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.ఎక్కడా తమ పట్టు చేజారిపోకుండా చూసుకుంటున్నారు.

రాజకీయంగాను పార్టీలోనూ తన బలం రోజురోజుకు పెంచుకుంటూనే వస్తున్నారు.తన తండ్రి చంద్రబాబు తరహాలోనే ఎప్పటికప్పుడు పార్టీలో పరిస్థితులను అంచనా వేస్తూ కిందిస్థాయి క్యాడర్ కు తగిన సూచనలు అందిస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ప్రజల్లో మొదట ఉన్నంత సానుకూలత ఇప్పుడు కనిపించడం లేదు.వివిధ సమస్యలు చుట్టుముట్టడం, ఆర్థిక ఇబ్బందులు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి.2019 ఎన్నికల్లో మాదిరిగా 2024 ఎన్నికలు ఉండవు అనే విషయం అందరికీ అర్థమైపోయింది.సరిగ్గా ఇదే సమయంలో తన ఆధ్వర్యంలో టిడిపిని బలోపేతం చేసి ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటుంది అని , అప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకు రావచ్చు అని, నిరంతరం వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ ఉండడంతో పాటు , వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

Advertisement

  త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్ యాత్ర చేపట్టేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు.పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాను ఈ స్థాయిలో కష్టపడుతున్నా, ఇంకా పార్టీ కేడర్ పూర్తిగా యాక్టివ్ కాలేదు అనేది లోకేష్ కు ఆగ్రహం కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే వరుసగా నియోజకవర్గ ఇన్చార్జి లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.నియోజకవర్గ ఇన్చార్జిలు లేనిచోట కొత్తవారిని నియమిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయా ఇన్చార్జి లకు ఘాటుగా లోకేష్ వార్నింగ్ ఇస్తున్నారట. 

ఎన్నికలకు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉందని, నిర్లక్ష్యంగా ఉంటే తాను ఊరుకోను అని, ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలను చేపడుతూ , వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచేందుకు నియోజకవర్గంలోని సమస్యలను హైలెట్ చేసుకుంటూ, వైసీపీ ప్రభుత్వ గ్రాఫ్ తగ్గించాలని,  అలాకాకుండా ఎన్నికల సమయంలో చూసుకుందాము అన్నట్లుగా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు అని , మీ స్థానం కొత్తవారిని నియమించేందుకు కూడా వెనకాడబోమని నియోజకవర్గ ఇన్చార్జిలకు లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ లు ఇస్తున్నట్లు సమాచారం.ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం తరచుగా నియోజకవర్గ ఇన్చార్జిల తో సమీక్షలు నిర్వహిస్తూ,  వారితో సమావేశాలు నిర్వహిస్తూ వారంతా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేయాలని గట్టిగానే హిత బోధ చేస్తున్నారట.     .

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు