గత కొద్దిరోజులుగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.దీంతో వాగులు, వంకలు, నదులు… పొంగిపొర్లుతున్నాయి.
నెల్లూరు అదే రీతిలో చిత్తూరు జిల్లాలో వర్షపు నీరు వీధుల్లోకి, పిల్లల్లో కి రావడం తో… జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటువంటి తరుణంలో సీఎం జగన్ ఈరోజు ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే సీఎం జగన్ ఏరియల్ సర్వే పై ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు.గాల్లో నుండి నేలమీదకు దిగితే సీఎంకు వరద కష్టాలు తెలుస్తాయని, వర్షాల కారణంగా రాయలసీమ ప్రాంతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అయితే రాయలసీమ వైపు సీఎం కనీసం కన్నెత్తి చూడటం లేదని లోకేష్ ఆరోపణలు చేశారు.
ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అని పేర్కొన్నారు.వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ప్రాణ ఆస్తి నష్టం సంభవించిందని అన్నారు.
కనీసం సీఎం సొంత జిల్లాలో ఏమైందో అనేది కూడా కొనుక్కోవటం లేదని విమర్శించారు.వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని అనేది కూడా బ్రమ అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.