పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసన తెలుపుతూ పాలకొల్లు నుండి ఇలపకుర్రు వరకు పల్లెవెలుగు బస్సులో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రయాణించారు.ఆర్టీసీ చార్జీల బాదుడే బాదుడు అంటూ బస్సులో డప్పు వాయించి నిరసన తెలిపారు.
పేద మధ్య తరగతి వర్గాల వాహనం ఆర్టీసీ బస్సు పై కూడా జగన్ కు కనికరం, దయ లేదు అని ఎద్దేవా చేసారు నిమ్మల రామానాయుడు.