గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమలో విహరిస్తూ ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణబీర్ ఎట్టకేలకు ఏప్రిల్ 14వ తేదీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
వివాహం జరిగే వరకు వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త పడిన ఈ జంట వివాహం అనంతరం మీడియా ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నెటిజనులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే అలియా భట్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే పెళ్లి అయిన మరుక్షణమే ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ మార్చేశారు.ఇప్పటివరకు సింగిల్ గా ఉన్నటువంటి ఆలియా వివాహం చేసుకోవడంతో తన పెళ్లికి సంబంధించిన ప్రొఫైల్ ఫోటో పెట్టారు.

పెళ్లి దుస్తులలో ఆలియా, రణబీర్ చూడచక్కగా ఉన్నటువంటి ఫోటోని ఈమె తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ గా అప్డేట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన ఎంతో మంది నెటిజన్లు వీరి జోడీపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇక పై ఇప్పటివరకు సోషల్ మీడియాలోకి రణబీర్ కపూర్ అడుగుపెట్టని సంగతి మనకు తెలిసిందే.వివాహం తరువాత ఈయన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







