అధ్యక్షా ..!: తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 17 నుంచే

తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన ఎమ్యెల్యేలంతా ఎప్పుడా.ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది.

 Telangana Assembly From 17th Of This Month-TeluguStop.com

చాలా రోజుల సమయం తరువాత … తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.ఈ నెల పదిహేడున కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.అలాగే… 18 న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తాత్కాలిక స్పీకర్ గా ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించారు.

ముఖ్యమంత్రి తర్వాత ఆయన అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.ఆరుసార్లు గెలిచారు.

ఈ నేపథ్యంలో జనవరి 16న సాయంత్రం 5గంటలకు ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌తో ప్రమాణం చేయిస్తారు.17న శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి.119 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.19న శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు.20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube