ఇమేజ్ మార్చుకునే ప్లాన్ లో నాని..?

నాచురల్ స్టార్ నాని తన నాచురల్ స్టార్ ఇమేజ్ మార్చుకోవాలని అనుకుంటున్నాడా.? అదేంటి ఫ్యాన్స్ ఇచ్చిన ఆ ఇమేజ్ ఎందుకు మార్చుకోవాలని అనుకుంటాడు అనుకోవచ్చు.

ఇవ్వడానికి నాచురల్ స్టార్ అని ఇచ్చినా కమర్షియల్ హిట్ విషయంలో ఇంకా నాని మీడియం బడ్జెట్ లోనే ఉన్నాడు.

స్టార్ గా సత్తా చాటే స్టామినా ఉన్నా సరే మీడియం బడ్జెట్ సినిమాలతో కానిచ్చేస్తున్నాడు.అందుకే శ్యాం సింగ రాయ్ సినిమాతో ఒక సీరియస్ సబ్జెక్ట్ తో తన కెరియర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తున్నాడు నాని.

ఇది ఖచ్చితంగా నాని తన ఇమేజ్ మార్చుకునే ఆలోచనతోనే అని అంటున్నారు కొందరు.

ఇక శ్యాం సింగ రాయ్ టీజర్ చూస్తే అది కన్ఫర్మ్ చేస్తున్నారు.నాని ఇదివరకు సినిమాల్లా కాకుండా ఈ సినిమాతో ఒక మెట్టు ఎక్కేలా ఉన్నాడు.స్టార్ గా తన కెపాసిటీ ఇది అని చూపించేలా శ్యాం సింగ రాయ్ తీసినట్టు అర్ధమవుతుంది.

Advertisement

క్రిస్ మస్ రేసులో వస్తున్న ఈ సినిమా తప్పకుండా పైచేయి మనదే అంటూ నాని ప్రమోషన్స్ లో చెబుతున్నాడు.మరి నాని చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు