అల్లు అర్జున్.సుకుమార్ ల కాంబోలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.
మొన్నటి వరకు ఈ సినిమా హిందీ రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఇటీవలే హిందీ రిలీజ్ కు సంబంధించిన విషయమై క్లారిటీ వచ్చింది.
హిందీ లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు మొదలు అయ్యాయి.దాదాపుగా 1500 థియేటర్లలో పుష్ప ను అక్కడ విడుదల చేస్తారని తెలుస్తోంది.
విడుదల తేదీ సమయంకు ఈ మొత్తం మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.ఇంత భారీ సినిమాను అక్కడ భారీ ఎత్తున ప్రమోట్ చేయడం కోసం బాలీవుడ్ స్టార్ ఒకరితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ముంబయిలో జరుగబోతున్న ఒక ఈవెంట్ కు మరియు ప్రీమియర్ షో కు ఆయన హాజరు అవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఆ స్టార్ ఎవరు అనేది రివీల్ చేయడం లేదు.కాని ఆ స్టార్ కు అల్లు అర్జున్ అంటే అభిమానం అని అందుకే ఆయన పుష్ప ప్రమోషన్ కు ముందుకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.అతి త్వరలోనే పుష్ప ప్రమోషన్స్ ను మొదలు పెడుతున్నారు.
ఒకటి రెండు వారాల్లో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి.సినిమా ను ఖచ్చితంగా అనుకున్న సమయంకు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సుకుమార్ అండ్ టీమ్ భావిస్తున్నారు.
ముంబయితో పాటు కేరళ మరియు బెంగళూరుల్లో కూడా పుష్ప ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతాయని అంటున్నారు.రష్మిక మందన్నా నటిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా 250 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంను అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
బన్నీ చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.