ప్లాప్‌ సినిమాకు సెలబ్రేషన్స్‌ ఏంటీ?

నాని నటించిన 25వ సినిమా వి తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా నేరుగా ఓటీటీలో విడుదల అయిన విషయం తెల్సిందే.

నాని మరియు సుధీర్‌ బాబు నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు.

అయితే సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది.దాంతో సినిమాకు నెగటివ్‌ టాక్‌ మొదలైంది.

చాలా మంది నాని ఇలాంటి రొటీన్‌ రివేంజ్‌ డ్రామాను ఎలా ఒప్పుకున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు.పాత్ర పరంగా బాగున్నా కూడా మొత్తం కథ పరంగా మాత్రం వి ఏమాత్రం ఆకట్టుకోలేదు.

సుధీర్‌ బాబు పోలీసు పాత్రలో ఆకట్టుకున్నాడు.అయితే సినిమాకు సంబంధించిన స్క్రీన్ ప్లే లో అతడికి ఎక్కువగా ప్రాముఖ్యత అనిపించలేదు.

Advertisement

సినిమా తాజాగా విడుదలై నెగటివ్‌ టాక్‌ దక్కించుకున్న కూడా యూనిట్‌ సభ్యులు మరియు కుటుంబ సభ్యులు సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నారు.సినిమా సక్సెస్‌ అంటూ తాజాగా సుధీర్‌ బాబు తన కుటుంబ సభ్యులతో పెద్ద పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది.

దీనికి తోడు వి యూనిట్‌ సభ్యులు కూడా ఇటీవల ఆన్‌ లైన్‌ ద్వారా మాట్లాడుకుని వారి ఆనందంను వ్యక్తం చేశారు.

సినిమాకు ఒక వైపు నెగటివ్‌ టాక్‌ వస్తుంటే ఫన్నీగా ఈ సెల్రబేషన్స్‌ ఏంటో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.థియేటర్లలో విడుదల అయిన సినిమాలకు ఇలాంటివి చేస్తే కాస్త పని చేస్తాయి.కాని ఆన్‌ లైన్‌ ప్రేక్షకులు విచక్షణతో ఆలోచిస్తారు.

కనుక ఖచ్చితంగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడటం ఖాయం అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు