'సరిపోదా శనివారం' షూట్ అప్డేట్.. యాక్షన్ బ్లాక్ తో షురూ..

న్యాచురల్ స్టార్ నాని ( Nani ) ఒక సినిమా రిలీజ్ కాకుండానే మరో సినిమా స్టార్ట్ చేస్తుంటాడు.

ఇక ఇప్పుడు కూడా ఒక సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచి దాని ప్రమోషన్స్ చేస్తూనే మరో కొత్త సినిమాను స్టార్ట్ చేసాడు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కొత్త సినిమాను అనౌన్స్ చేయగా దసరా పండుగ రోజే లాంచ్ కూడా అయిపొయింది.ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ తోనే అందరిని ఇంప్రెస్ చేసేసాడు.

అసలు సరిపోదా శనివారం( Saripodhaa Sanivaram ) అనే టైటిల్ హాట్ టాపిక్ అయ్యింది.గ్లింప్స్ కూడా సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో అదిరిపోయింది.

ఇలా స్టార్ట్ చేయకుండానే సినిమాకు కావాల్సినంత హైప్ ఇచ్చారు మేకర్స్.

Nani Saripodhaa Sanivaaram Shoot Started, Saripodhaa Sanivaaram, Sj Surya, Nani,
Advertisement
Nani Saripodhaa Sanivaaram Shoot Started, Saripodhaa Sanivaaram, SJ Surya, Nani,

ఇదిలా ఉండగా నిన్న దీపావళి పండుగ రోజు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ చేసినట్టు మేకర్స్ తెలిపారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ చెబుతూ షూట్ స్టార్ట్ అయ్యిందని చెప్పడంతో అప్పుడే నాని మొదలెట్టాడు అని కన్ఫర్మ్ అయ్యింది.

Nani Saripodhaa Sanivaaram Shoot Started, Saripodhaa Sanivaaram, Sj Surya, Nani,

కాగా ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్( Priyanka Arul Mohan ) ను హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.అలాగే కీలక పాత్రలో ఎస్ జే సూర్య నటిస్తున్నట్టు ప్రకటించారు.ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

అంతకంటే ముందు నాని డిసెంబర్ 7న హాయ్ నాన్న ( Hi Nanna )సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

చూడాలి నాని దసరా తర్వాత రాబోతున్న సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు