నానికి ఇష్టమైన బ్రాండ్ ఇదే.. బాలయ్యతో కలిసి ఆ మూవీ చేస్తానంటూ?

న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

అయితే న్యాచురల్ స్టార్ నాని భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం నాని బిగ్ బాస్ సీజన్2 కు హోస్ట్ గా వ్యవహరించి ఆ షోను హిట్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా నాని బాలయ్య హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు వచ్చారు.

బాలయ్య ఈ షోలో నానీతో మాట్లాడుతూ తాను ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతానని రిలాక్స్ కావడం కోసం సాయంత్రం సమయంలో నాన్న నటించిన సినిమాలను చూస్తానని ఇంకొంచెం రిలాక్స్ కావడానికి మాన్షన్ హౌజ్ తాగుతానని చెప్పుకొచ్చారు.మరి నువ్వు ఏ విధంగా రిలాక్స్ అవుతావంటూ బాలయ్య నానిని ప్రశ్నించారు.

నాని ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ రిలాక్స్ కావాలంటే ఏదో ఒక మూవీ చూడాల్సిందేనని చెప్పారు.రిలాక్స్ కావడానికి తాను మ్యూజిక్ వింటానని నాని అన్నారు.

Advertisement

అప్పుడప్పుడూ రెడ్ వైన్ తాగుతానని నాని తన సీక్రెట్స్ ను చెప్పుకొచ్చారు.

హాలీవుడ్ లో క్లాసిక్ గా నిలిచిన గాడ్ ఫాదర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఆ సినిమాలో బ్రాండో పాత్రలో బాలకృష్ణ అల్ పాచనో పాత్రలో తాను నటిస్తే బాగుంటుందని నాని కామెంట్లు చేశారు.ఈ షో మూడో ఎపిసోడ్ కు వెంకటేష్ గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ వెంకటేష్ తో ఎలాంటి సీక్రెట్స్ ను చెప్పిస్తారో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ కూడా ఈ షోకు వస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.బాలయ్య షోకు ఎన్టీఆర్ రావాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు