అసెంబ్లీ వైపు మ‌రో నంద‌మూరి హీరో చూపులు..!

తెలుగు సీమ‌లో నంద‌మూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ చెప్ప‌క్క‌ర్లేదు.దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ అటు వెండితెర మీద రారాజుగా వెలుగొంది.

టీడీపీతో పొలిటిక‌ల్‌గా కూడా రారాజుగా ఎదిగారు.ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తెలుగు నేల‌మీద ఎన్నో రాజ‌కీయ సంచ‌ల‌నాల‌కు వేదిక అయ్యింది.

ఎన్టీఆర్ క్రేజ్ నంద‌మూరి ఫ్యామిలీకి అలా కంటిన్యూ అవుతూనే ఉంది.ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ త‌ర్వాత అదే ఫ్యామిలీ నుంచి ఆయ‌న వార‌సులు అయిన హ‌రికృష్ణ - జ‌య‌కృష్ణ - బాల‌కృష్ణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

వీరిలో హ‌రికృష్ణ గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు.త‌ర్వాత అన్న టీడీపీ స్థాపించి ప్లాప్ పొలిటిక‌ల్ షో వేశారు.

Advertisement

తిరిగి టీడీపీలోకి వ‌చ్చి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు.ఇక జ‌య‌కృష్ణ అన్న టీడీపీ త‌ర‌పున శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక‌.

రాజ‌కీయంగా క‌నుమ‌రుగ‌య్యారు.ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ వార‌సుడిగా ఆయ‌న చేత పిలిపించుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

ఈ క్ర‌మంలోనే అదే నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన మ‌రో హీరో చూపులు సైతం అసెంబ్లీ వైపే ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఒక‌టో నెంబ‌ర్ కుర్రాడిని అంటూ వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన తార‌క‌ర‌త్న సినిమాల్లో హీరోగా స‌క్సెస్ కాలేక‌పోయాడు.త‌ర్వాత విల‌న్‌గా మారి ఒక‌టి రెండు స‌క్సెస్‌లు కొట్టిన తార‌క్ త‌న తాత స్థాపించిన టీడీపీ గెలుపుకోసం గ‌త రెండు ఎన్నిక‌ల్లోను తన వంతుగా ప్ర‌చారం చేస్తున్నాడు.2009, 2014 ఎన్నిక‌ల్లో తార‌క‌ర‌త్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ అభ్య‌ర్థులు గెలుపుకోసం త‌న వంతుగా ప్ర‌చారం చేశాడు.ఈ రెండు ఎన్నిక‌ల్లోను ఈ రెండు జిల్లాల్లో టీడీపీ మంచి ఫ‌లితాలే సాధించింది.

ఇదిలా ఉంటే 2019 ఎన్నిక‌ల్లో తార‌క‌ర‌త్న గుంటూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉంటాడ‌న్న వార్త‌లు టీడీపీలో విన‌వ‌స్తున్నాయి.తార‌క‌ర‌త్న ఇదే విష‌యాన్ని ఇప్ప‌టికే మామ చంద్ర‌బాబు దృష్టికి కూడా తీసుకువెళ్లగా బాబు చూద్దాం అని అన్న‌ట్టు కూడా స‌మాచారం.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

అయితే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి వీటి సంఖ్య పెరిగితే ఏమోగాని.లేనిప‌క్షంలో తార‌క‌ర‌త్న అసెంబ్లీ ఆశ‌లు నెర‌వేర‌డం క‌ష్టమే.వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు - బాల‌య్య‌తో పాటు లోకేష్ సైతం ఎన్నిక‌ల బ‌రిలో ఉంటారు.

Advertisement

బ్రాహ్మ‌ణి పేరు సైతం వినిపిస్తోంది.ఫ్యామిలీలో వీళ్లంద‌రితో పాటు తార‌క‌ర‌త్న‌కు కూడా సీటు ఇవ్వ‌డం అసాధ్య‌మే.

మొత్తానికి ఇప్ప‌టికైతే.తార‌క ర‌త్న‌.

పొలిటిక‌ల్ ఎంట్రీపై మాత్రం పొగ స్టార్ట్ అయ్యింది.

తాజా వార్తలు