ప్లాప్ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇస్తున్న నాగశౌర్య... కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో నాగశౌర్య( Naga Shaurya )ఒకరు.ప్రస్తుతం ఈయన వరుస సినిమాలను చేస్తూ వెళ్తున్నాడు.

తప్ప ఆయనకు సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు.ఇక 2018లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఛలో సినిమా మాత్రమే ఆయనకు మంచి సక్సెస్ అందించింది.

ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో ఏది కూడా చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే సాధించలేదు.

Nagashaurya Is Giving Another Chance To The Flop Director What Is The Reason , N

ఇక గత చిత్రమైన రంగబలి తో ప్లాప్ ను అందుకున్నప్పటికి ఆయన ప్రస్తుతం ఆ దర్శకుడు అయిన పవన్ బసంశెట్టి( Director Pawan Basamsetti )తో మరొక సినిమా చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి( Sudhakar Cherukuri ) ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు.అయితే ఈ సినిమాని మళ్లీ ఆ దర్శకుడికే ఇవ్వడానికి గల కారణం ఏంటి కథ బాగుందా లేదంటే వచ్చిన నష్టాన్ని పూడ్చడానికి ఈ సినిమా చేస్తున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

Advertisement
Nagashaurya Is Giving Another Chance To The Flop Director What Is The Reason , N

ఈ సినిమాతో వీళ్ళు ఒక భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు.ఇప్పుడుఅందుతున్న సమాచారం ప్రకారం నాగశౌర్య ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు సెట్స్ మీద ఉన్నప్పటికీ ఈ సినిమాను మాత్రం చాలా తొందరగా స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న తెలుస్తుంది.

Nagashaurya Is Giving Another Chance To The Flop Director What Is The Reason , N

ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పటికే దర్శకుడు చెప్పిన కథను విని ఫైనల్ చేశారట తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ను కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక దీంతోపాటుగా నాగశౌర్యం మరి కొంతమంది కొత్త డైరెక్టర్ అని కూడా ఎంకరేజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది అందుకోసమే ఆయన ఇప్పుడు కొత్త కథలను కూడా వింటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు