Nagarjuna : నాటుకోడి బిర్యాని తిని బీరు తాగినప్పుడు ఆ ఆలోచన వచ్చింది.. నాగార్జున కామెంట్స్ వైరల్!

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున( Nagarjuna ) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

అయితే ఈయన ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక నాగార్జున కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సినిమాలలో కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే.నాగార్జున సినీ కెరియర్లో అన్నమయ్య శ్రీరామదాసు శిరిడి సాయిబాబా వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయని చెప్పాలి.

ఈ ఆధ్యాత్మిక సినిమాలన్నీ కూడా ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాలను సొంతం చేసుకున్నాయి.

ఇక ఈ సినిమాలలో నాగార్జున పూర్తిగా లీనమైపోయినటించారనే చెప్పాలి.ఇలా ఈ సినిమాలన్నీ నాగార్జున కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలుగా నిలిచాయి.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగార్జున తన సినీ కెరియర్ లో వచ్చినటువంటి ఈ సినిమాల గురించి పలు విషయాలు వెల్లడించారు.

Advertisement

ముఖ్యంగా శిరిడి సాయి ( Shiridi Sai ) సినిమా గురించి నాగార్జున చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అసలు శిరిడి సాయి సినిమా చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది అంటూ ఈయనని ప్రశ్నించడంతో ఈయన అసలు విషయం వెల్లడించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నేను షిరిడి సాయి సినిమా చేసే వరకు ఒక్కసారి కూడా షిరిడి వెళ్లలేదని తెలిపారు.అయితే నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఇప్పటికీ తెలియదు.బహుశా ఇదంతా బాబా లీల కూడా అయ్యి ఉండొచ్చు అంటూ నాగార్జున తెలిపారు.

నేను సోమవారం నుంచి శనివారం వరకు ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్ గా ఉంటాను ఆదివారం ఫుడ్ విషయంలో తనకు ఎలాంటి కంట్రోల్ ఉండదని నాగార్జున ఈ సందర్భంగా చెప్పారు.ఆదివారం వచ్చిందంటే కడుపునిండా తిని తృప్తిగా నిద్రపోతాను అంటూ ఈయన తెలిపారు అలాగే ఒక ఆదివారం ఫుల్లుగా నాటుకోడి బిర్యాని తిని బీరు తాగి ఉన్నాను అలాంటి సమయంలో షిరిడి సాయిబాబా సినిమా గురించి ఆలోచన వచ్చింది.

ఇలా తనకు ఆలోచన రావడంతోనే వెంటనే రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) గారిని కలిసాను అప్పుడు ఆయన అన్నమయ్య 2 గురించి మాట్లాడుతున్నారు.మరి అన్నమయ్య ఎందుకు శిరిడి సాయిబాబా గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు అని తనకు నా ఆలోచన చెప్పేశాను.ఇలా షిర్డీ సాయిబాబా గురించి నేను రాఘవేంద్ర రావు గారికి చెప్పడంతో ఆయన వెంటనే ఈ సినిమా గురించి ఆలోచనలో పడ్డారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఇక ఈ ఆలోచన వచ్చిన తర్వాత నేను షిరిడి వెళ్లి బాబా దర్శనం కూడా చేసుకున్నానని తెలిపారు.ఇక ఈ విషయం తెలిసినటువంటి రాఘవేంద్రరావు గారు మేమే నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాము ఎలాగో మీరే వెళ్లేసి వచ్చారు.

Advertisement

మనం షిరిడి సాయిబాబా గురించి సినిమా చేస్తున్నాము అంటూ ఈ సినిమా అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని నాగార్జున తెలిపారు.మొత్తానికి షిరిడి సాయిబాబా సినిమా చేయాలని ఆలోచన నాగార్జునకు బాగా బిర్యాని తిని మందు తాగిన సమయంలో వచ్చింది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు