ఆ ఇష్టాలను వదులుకున్నానని చెబుతున్న నాగచైతన్య.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో నాగచైతన్య ఒకరు కాగా నాగచైతన్య( Naga Chaitanya)కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న తండేల్ సినిమా( Thandel Movie )పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

దూత వెబ్ సిరీస్ తో సక్సెస్ ను సొంతం చేసుకున్న చైతన్య వ్యక్తిగత జీవితంలో సైతం సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

Nagachaitanya Comments About His Favourites Details Inside Goes Viral In Social

అయితే చైతన్య తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ నా ఇష్టాలను కొన్ని కారణాల వల్ల వదులుకున్నానని చెప్పుకొచ్చారు.కార్ రేస్ విషయంలో ప్రస్తుతం తాను ఆలోచిస్తున్నానని చైతన్య కామెంట్లు చేశారు.తాను సినిమాల్లోకి రాకముందే ఒక స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశానని చైతన్య తెలిపారు.

తాను కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కారు( Sports car)లో ఎక్కువగా షికార్లు చేసేవాడినని చైతన్య కామెంట్లు చేయడం గమనార్హం.

Nagachaitanya Comments About His Favourites Details Inside Goes Viral In Social
Advertisement
Nagachaitanya Comments About His Favourites Details Inside Goes Viral In Social

నిర్మాతలు నన్ను నమ్మి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారని అలాంటి సమయంలో నేను డ్రైవింగ్ కు సంబంధించి ఏ మాత్రం పొరపాటు చేసినా ఇబ్బంది పడాల్సి వస్తుందని నాగచైతన్య కామెంట్లు చేశారు.ఎక్కువ స్పీడ్ తో డ్రైవింగ్ చేయవద్దని నా ఫ్రెండ్స్ కూడా సూచనలు చేశారని వెల్లడించారు.గతంలో తన ఆలోచన ఎప్పుడూ కార్లపైనే ఉండేదని ఆయన కామెంట్లు చేశారు.

రేసింగ్ కార్లు అంటే అంత ఇష్టమని ఆయన పేర్కొన్నారు.అప్పుడప్పుడూ రేసింగ్ కార్లను నడుపుతాను కానీ జాగ్రత్తగా నెమ్మదిగా నడిపానని చైతన్య పేర్కొన్నారు.

నాగచైతన్య తండేల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.నాగచైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

చైతన్య తర్వాత మూవీ మాస్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.చైతన్య సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు