చిరంజీవి సినిమాలు పవన్ రాజకీయాలు! నాగబాబు క్లారిటీ

ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో తన సుదీర్ఘ ప్రస్తానం కోసం ప్రయాణం చేస్తున్నారు.

ఇక తను రాజకీయాలలో ఉంటూ ప్రజలకి సేవ చేయడంలోనే సంతృప్తి వెతుక్కుంటూ వెళ్తున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత గత కొన్నేళ్ళుగా రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉన్నారు.అయితే ఆ మధ్య కాలంలో చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని కలవడం జరిగింది.

తరువాత మూడు రాజధానులకి సపోర్ట్ గా ఆడియో రిలీజ్ చేసారు.ఈ నేపధ్యంలో అతను వైసీపీకి దగ్గర అవుతున్నారు అంటూ రాజకీయాలలో ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే ఈ విషయాన్ని చిరంజీవి ఖండించకపోవడంతో ఇవి మరింత విస్తృతంగా వ్యాపించాయి.గత కొంత కాలంలో చిరంజీవిని రాజ్యసభకి ఎంపీగా పంపించేందుకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నాడని, దీనిపై అతనికి రాజ్యసభ సీటు కూడా ఖరారు అయిపోయిందని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఇక రాజ్యసభలో వైసీపీ తరుపున ఎంపీగా వెళ్లి ఎన్డీఏ సర్కార్ లో కేంద్ర మంత్రిగా కూడా ఎంపికయ్యే అవకాశం ఉందని కూడా జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.అయితే ఈ ప్రచారం అంతా జనసేన పార్టీ క్యాడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే అని జనసైనికులు భావించారు.

అందుకు తగ్గట్లుగానే మెగా బ్రదర్ నాగబాబు తన యుట్యూబ్ చానల్ ద్వారా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు.చిరంజీవి ఏ పార్టీ తరుపున రాజ్యసభకి వెళ్ళడం లేదని, అతను రాజకీయాలలో కివచ్చే ఉద్దేశ్యం కూడా లేదని చిరంజీవి పూర్తి సమయం సినిమాలకి అంకితం చేశారని, పవన్ కళ్యాణ్ మత్రమే జనసేన పార్టీతో రాజకీయాలలో చురుకుగా ఉంటారని స్పష్టం చేసేశారు.

దీంతో ఇంత వరకు జరిగిన ప్రచారం అంతా వైసీపీ ప్లాన్ లో భాగంగా జనసైనికులని తప్పుదోవ పట్టించడానికి అని స్పష్టం అయ్యింది.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు