పదో తరగతి ఫలితాలపై నాగబాబు సమాధానాలు.. చదువు గురించి మీకేమైనా తెలుసా అంటూ ట్రోల్స్ !

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా బ్రదర్, యాక్టర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆయన ఎన్నో సినిమాలలో చేసి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించాడు.ఇప్పటికీ వెండితెరపై పలు సహాయ పాత్రలలో నటిస్తున్నాడు.

కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా జబర్దస్త్, అదిరింది, బొమ్మ అదిరింది అనే కామెడీ షోలో జడ్జిగా కూడా చేశాడు.వెండితెరపై నటుడిగా 50కి పైగా సినిమాలలో నటించాడు.

నిర్మాతగా ఎనిమిది సినిమాలకు బాధ్యతలు చేపట్టాడు.చివరగా ఆరంజ్ సినిమాలో నిర్మాత గా బాధ్యతలు చేపట్టగా ఈ సినిమా ఆయనను బాగా నిరాశపరిచింది.

Advertisement

దీంతో ఆ తర్వాత ఈయన నిర్మాతగా బాధ్యతలను వదులుకొని బుల్లి తెర పై వరుస షో లలో జడ్జిగా చేశాడు.ఇక రాజకీయపరంగా ఈయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరి 2019 నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోక్ సభకు పోటీ చేశాడు.

కానీ ఈయన వైసీపీ, తెలుగుదేశం తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.ఇప్పటికీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయంగా కూడా బాగా యాక్టివ్ గా ఉన్నాడు.

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన నాగబాబుకు ఆ తర్వాత బుల్లితెరపై అంతగా కలిసి రాలేదు.

అలా కొంతకాలం బుల్లితెరకు బ్రేక్ ఇవ్వగా మళ్లీ ఈ మధ్య పలు షోలలో, ఈవెంట్లలో దర్శనమిస్తూ బాగా సందడి చేస్తున్నాడు.ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో లో జడ్జిగా చేస్తున్నారు.ఇక ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

నాగబాబు సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటాడు.నిత్యం ఏదో ఒక టాపిక్ తో బాగా హల్ చల్ చేస్తాడు.

Advertisement

ఆయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం తో అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే ఉంటాడు.

నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తాడు.మధ్య మధ్యలో తన మీమ్స్ తో నెటిజన్లను తెగ నవ్విస్తుంటాడు.

సోషల్ మీడియాలో ఎక్కువగా రాజకీయాన్ని కూడా చేస్తుంటాడు నాగబాబు. వైసీపీ పార్టీని ఉద్దేశించి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడు.

ఇక తాజాగా కూడా పదో తరగతి ఫలితాలపై కొన్ని రకాల సమాధానాలు ఇవ్వడం తో బాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.తాజాగా ఈయన నెటిజన్లతో కాసేపు ముచ్చటించాడు.అందులో పదోతరగతి రిజల్ట్ పై అభిప్రాయం అడగటంతో ఆయన రకరకాలుగా కామెంట్లు పెట్టాడు.

దీంతో ఆయన పెట్టిన కామెంట్లకు గోవిందా గోవిందా అంటూ వైసీపీ నామాలు పెట్టడం ఏంటి.గతంలో కరోనా సమయంలో కాబట్టి గతంలో అప్పుడు అందరినీ ఒకేలా చూశారు అని.ఏం సమాధానం చెబుతున్నారు అంటూ.అంతేకాకుండా ఫెయిల్ అయిన పాసైన అమ్మ ఒడి డబ్బులు పడవని మీకు ఏమైనా చెప్పారా ఎక్కడనో ఉన్న గాసిప్ అని అన్నారని అనడం ఏంటీ.

మీకు చదువు గురించి ఏమైనా తెలుసా అంటూ వైఎస్ఆర్సీపీ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు