నాగ శౌర్య పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిన 'వరుడు కావలెను' చిత్రం యూనిట్..!

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న హీరో నాగ శౌర్య.

చిన్న చిన్న సినిమాలు తీసుకుంటా తనదైన రీతిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు నాగ శౌర్య.

తెలుగు ఇండస్ట్రీ లో ఊహలు గుసగుసలాడే, లక్ష్మీ రావే మా ఇంటికి, కల్యాణ వైభోగమే, ఛలో ఇలా విభిన్న సినిమాలు చేస్తూ  ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాడు.నేడు నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న " వరుడు కావలెను"  సినిమా నుంచి బర్త్ డే స్పెషల్ టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమాలో నాగశౌర్య అందమైన కథానాయకుడుగా.మరింత అందంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, ముస్తాబవుతున్న సన్నివేశాలు ఎంతో బాగా కనిపిస్తాయి.

టీజర్ లో భాగంగా చివరిలో 21 మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థమవుతుంది.ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్ వహిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ఇటీవల కాలంలోనే సినిమా పేరును అధికారికంగా ప్రకటన చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేయగా ఆది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.నాగ శౌర్య సరసన రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది.నాగ శౌర్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రేక్షక అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ.

మంచి ప్రశంసలను సొంతం చేసుకుంటుంది.ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతుండగా, మరోవైపు ఈ సినిమా ప్రేక్షక అభిమానులను కథనం, పాటలు, సన్నివేశాలు అన్నీ కూడా బాగా అలరిస్తాయని, అన్ని  వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా బాగా అలరిస్తుందని చిత్ర యూనిట్ వారి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈ సినిమాలో నాగ శౌర్య చాలా స్టైలిష్ గా కనపడబోతున్నట్లు అర్థం అవుతుంది.  ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బర్త్ డే స్పెషల్ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.

ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?
Advertisement

తాజా వార్తలు