ఎంతమందిని ముద్దు పెట్టుకున్నానో లెక్కలేదు... చైతూ షాకింగ్ కామెంట్స్!

అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) తాజాగా నటించిన చిత్రం కస్టడీ(Custody).

దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu)దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ ఇంటర్వ్యూలలో సినిమా గురించి తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియచేసినప్పటికీ తన వ్యక్తిగత విషయాలను మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

తాజాగా నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా యూట్యూబర్ ఇర్ఫాన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇందులో డేర్ అండ్ ట్రూత్ సెగ్మెంట్ లో చైతన్య పాల్గొన్నారు.ఇందులో భాగంగానే చైతన్య ఇర్ఫాన్ ను ప్రశ్నిస్తూ ఇప్పటివరకు మీరు ఎంత మందిని ముద్దు పెట్టుకున్నారని అడిగారు ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ.

Advertisement

నాకు తెలియదు.తాను ఎంతమందికి ముద్దు పెట్టుకున్నానో లెక్క తెలియడం లేదు.సాధారణంగా సినిమాలలో చాలా ముద్దు సన్నివేశాలు ఉంటాయి అవన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం.

ఇలా తాను సినిమాలలో ముద్దు పెట్టుకున్నటువంటి సన్నివేశాలు అందరికీ తెలిసిందే.ఇందులో నేను దాచాల్సిన నిజం ఏమీ లేదు.అయినా ఈ వీడియో మీరు బయటకు పెట్టిన తర్వాత నేను కూడా కాస్త ఇబ్బందులలో పడతానేమో అంటూ సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పారు.

ఇలా ముద్దుల గురించి ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నాగచైతన్య సమంతకు(Samantha) విడాకులు ఇచ్చిన తర్వాత మరొక నటి శోభితతో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ రెస్టారెంట్లలో కలిసి కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావిస్తున్నారు మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు