జాతకాలను నమ్ముతారా అనే ప్రశ్నకు చైతన్య జవాబిదే.. వేణుస్వామికి భారీ షాకిచ్చాడుగా!

టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాల ( Naga Chaitanya , Sobhita Dhulipala ) ఇటీవల ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటైన విషయం మనందరికీ తెలిసిందే.

అప్పటి నుంచి ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి.

ఇక వీరి ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫొటోస్ పై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.వీరికి 2027లో ఎడబాటు తప్పదు అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి( Venu Swamy ).ఎంగేజ్మెంట్ జరిగిన మరుసటి రోజు వీడియోని సోషల్ మీడియాలో వదిలారు వేణు స్వామి.

పైగా సమంతతో పోలిస్తే కెరీర్ పరంగా కూడా శోభిత జాతకం అసలు బాలేదంటూ వేణుస్వామి కామెంట్స్ చేశారు. సమంత, చైతన్య( Samantha, Chaitanya ) జంటకి 100కి 50 మార్కులు ఇస్తే చైతన్య శోభిత జోడీకి 10 మార్కులు కూడా ఇవ్వలేనంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు.ఇలా నాగ చైతన్య శోభిత పెళ్లి జీవితంపై వేణుస్వామి ఇలా వీడియో పెట్టగానే అలా వైరల్ అయిపోయింది.

ఇంకేముంది రెండు రోజులుగా వేణుస్వామిపై సోషల్ మీడియాలో కారాలు మిరియాలు నూరుతున్నారు అక్కినేని అభిమానులు.ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్యకి సంబంధించిన ఒక పాత వీడియోను వైరల్ చేస్తున్నారు.

Advertisement

ఇందులో నువ్వు జాతకాన్ని నమ్ముతావా అంటూ రానా( Rana ) అడిగిన ప్రశ్నకి.జాతకాన్ని నమ్మడం, నమ్మకపోవడం నా కన్వీనియన్స్‌పై ఆధారపడి ఉంటుంది.జాతకం బావుందంటే ఓకే నమ్ముతా లేకపోతే అసలు పట్టించుకోను అంటూ చై ఆన్సర్ ఇచ్చారు.

ఇక ఆ వీడియోని వైరల్ చేయడంతో పాటు వేణు స్వామిని ట్యాగ్ చేస్తూ ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.శుభమా అని పెళ్లి జరగబోతుంటే ఇలాంటి అపశకునాలు అవసరమా అంటూ వేణుస్వామిని విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు