మరో మజిలీ రెడీ చేస్తోన్న చైతూ.. నిజమేనా?

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ జోరు మీదున్నాడు.

కాగా ఆయన నటించిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు ఈ అక్కినేని బుల్లోడు.

కాగా ఈ సినిమాకు ‘థ్యాంక్ యు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే ఫిక్స్ చేసింది.కాగా ఈ సినిమాతో మరోసారి మజిలీ చిత్రాన్ని మనకు గుర్తుకు చేయనున్నాడట చైతూ.

తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిన మజిలీలో చైతూ క్రికెట్ ఆటగాడిగా, కోచ్‌గా కనిపించాడు.ఇప్పుడు మరోసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చైతూ కనిపించనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

విక్రమ్ కుమార్ తెరకెక్కించబోయే సినిమా హాకీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనుందని, ఇందులో చైతూ హాకీ ప్లేయర్‌గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అక్కినేని హీరోలకు అదిరిపోయే హిట్లు అందించే విక్రమ్ కుమార్, మరోసారి చైతూతో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా ప్రాముఖ్యతను అందుకుంది.

ఇక ఈ సినిమాలో చైతూ సరసన హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా రివీల్ చేయలేదు.దీంతో చైతూ ఈసారి ఎవరితో రొమాన్స్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.మరి ఈసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాతో చైతూ ఎలాంటి హిట్ అందుకుంటాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

Advertisement

తాజా వార్తలు