నిహారికను చిట్టి దెయ్యం అంటున్న నాగబాబు.. ఎందుకంటే?

తల్లిదండ్రులకు పిల్లలు అంటే పంచ ప్రాణాలు అనే సంగతి తెలిసిందే.పిల్లల ఎదుగుదలలోనే తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వెతుక్కుంటారు.

అందులో తండ్రి ఆడపిల్ల అంటే మరింత గారాబంగా చూసుకుంటాడు.నిన్న డాటర్స్ డే కావడంతో మెగాబ్రదర్ నాగబాబు తన కూతురిపై ఉన్న ప్రేమను, ఆప్యాయతను తనదైన శైలిలో వ్యక్తం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన నిహారిక కొణిదెలను చిట్టిదెయ్యం అంటూ కామెంట్ చేశారు.ఢీ జూనియర్స్ డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా బుల్లితెర, ఒక మనస్సు సినిమాతో వెండితెరకు పరిచయమైన నిహారిక అనతి కాలంలోనే తన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకుంది.

ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ నిహారిక కు నటిగా మంచి పేరు తెచ్చుకుంది.హీరోయిన్ గా నటించిన ఒక మనస్సు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలు హిట్ కాకపోయినా నటిగా నిహారికకు మంచి గుర్తింపు దక్కింది.

Advertisement

గతేడాది విడుదలైన సైరా సినిమాలో చిన్నపాత్రలో మెరిసిన నిహారిక నిశ్చితార్థం కొన్ని రోజుల క్రితం జరిగింది.నిన్న డాటర్స్ డే కావడంతో నాగబాబును తన కూతురుతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ కూతుళ్లంటే చిట్టి దెయ్యాలే అని అన్నారు.

మనం కలలు కనే చిట్టి దెయ్యాలు కూతుళ్ల రూపంలో భూమి మీదకు వస్తాయని చెప్పారు.కూతుళ్లు నవ్విస్తారని, ఏడిపిస్తారని, సంతోషపడేలా చేస్తారని, ఆట పట్టిస్తారని, చిరాకు తెప్పిస్తారని అన్నారు.

నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.తన కూతురుతో పాటు " ప్రతి దెయ్యానికి డాటర్స్ డే శుభాకాంక్షలు" అని నాగబాబు పోస్ట్ చేశారు.

నిహారికకు కాబోయే భర్త పేరు చైతన్య.ఇతను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

కొన్ని రోజుల క్రితం నిహారిక కాబోయే భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు